Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

కన్వీనర్ కోటా రేసులో 63,777

* గత ఏడాది కంటే 1,884 మంది ఎక్కువ
* ముగిసిన ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు 63,777 మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. గత నెల 22న ప్రారంభమైన ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. మొత్తం 1,04,500 మంది ఎంసెట్‌లో అర్హత సంపాదించగా కౌన్సెలింగ్‌కు 63,777 మంది(61%) హాజరయ్యారు. గత ఏడాదితో పోల్చుకుంటే 1,884 మంది ఎక్కువ. గత ఏడాది మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలనకు 61,896 మందే ముందుకొచ్చారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి ఈనెల 5వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.
గత ఏడాది ప్రవేశాలు తెలుసుకోవాలంటే...
గత ఏడాది ఏ కళాశాలలో, ఏ కోర్సులో, ఏ విభాగం వారికి ఎంత ర్యాంకు వరకు సీటు వచ్చిందో తెలుసుకునేందుకు కావాల్సిన వివరాలు వెబ్‌సైట్లలో ఉన్నాయని, వాటిని పరిశీలించాలని ఎంసెట్ ప్రైవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలో సీటు పొందేందుకు ప్రాధాన్యం ప్రకారం ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఆయన విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.

Published on 02.07.2016