Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

28 నుంచి నిట్ ప్రథమ సంవత్సరం తరగతులు

* తాడేపల్లిగూడెం నిట్ సమన్వయకర్త రమేష్ వెల్లడి
తాడేపల్లిగూడెం (సాంస్కృతిక), న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్) ప్రథమ సంవత్సరం తరగతులు జులై 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఈ ఏడాది నూతనంగా 440 మంది విద్యార్థులు నిట్‌లో చేరనున్నారని సమన్వయకర్త రమేష్ శుక్రవారం వెల్లడించారు. కొత్తగా చేరే విద్యార్థుల సౌలభ్యం కోసం పెదతాడేపల్లిలో రెండు బహుళ అంతస్తుల భవనాలు అద్దెకు తీసుకున్నామని వెల్లడించారు. ఒక దానిలో 200, మరో భవనంలో 100 మందికి వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. బాలికలకు మాత్రం శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో వసతి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. నిట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఈ నెల 11 నుంచి అనుబంధ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీకి పూర్తవుతాయి. నెలాఖరు నాటికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Published on 02.07.2016