Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

158 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు

* 83 కళాశాలలకు అనుమతి నిరాకరణ
ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధిలో 2016-17 విద్యాసంవత్సరానికి 204 వృత్తివిద్యా కళాశాలలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) లభించింది. ఈ జాబితాను జులై 3న రాత్రి వర్సిటీ విడుదల చేసింది. గుర్తింపు కోసం 241 ఇంజినీరింగ్‌ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా.. 158 కళాశాలలకే అనుమతి లభించింది. ఫార్మసీ విభాగంలో 89 కళాశాలలు దరఖాస్తు చేసుకోగా.. 46 కళాశాలలకు మాత్రమే అనుమతి దొరికింది.
* ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 671 కోర్సులలో 79705 సీట్లకు అనుమతి లభించింది. గత ఏడాది కంటే 37 వేల సీట్లు తగ్గాయి.
* 46 ఫార్మసీ కళాశాలల్లో 4000 సీట్లకు అనుమతి. ఈ విభాగంలో సగం సీట్లు తగ్గాయి.


Published on 04.07.2016