Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఏపీలో ప్రైవేట్ పశువైద్య కళాశాలలు!

* మత్స్య, డెయిరీ టెక్నాలజీ విభాగాల్లో కూడా
* ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ రంగంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వెటర్నరీ, మత్స్య, డెయిరీ టెక్నాలజీ కళాశాలలు రానున్నాయి. వీటి ఏర్పాటుకు వీలుగా ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చింది. పశుసంవర్థకశాఖ, డెయిరీ, మత్స్య రంగంలో మానవ వనరుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ రంగంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే 2 పశువైద్య కళాశాలలు (బీవీఎస్సీ, ఏహెచ్), రెండు మత్స్య (బీఎఫ్ఎస్‌సీ), ఒక డెయిరీ టెక్నాలజీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published on 06.07.2016