Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులు ఇలా...

ఏపీలో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు క‌ల్పించే ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజుల‌ను ప్రభుత్వం ఖ‌రారు చేసింది. ఇంత‌కు ముందు ప్రక‌టించిన ఫీజుల వివ‌రాల్లో స్వల్ప మార్పులు చేసింది. గ‌తంలో ప్రక‌టించిన గ‌రిష్ఠ, క‌నిష్ఠ ఫీజుల‌ను య‌థావిధిగానే ఉంచారు. కొన్ని క‌ళాశాల‌ల ఫీజుల‌ను స్వల్పంగా కుదించారు. అలాగే ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఆప్షన్లు ఇచ్చుకోవ‌డానికి గడువు పొడిగించారు. జూన్ 26 (ఆదివారం) సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవ‌చ్చు.

తాజాగా ప్రక‌టించిన వివ‌రాల ప్రకారం కొన్ని క‌ళాశాలల్లో ఫీజులు ఇలా ఉన్నాయి...
ఆర్‌వీఆర్ అండ్ జేసీ, గుంటూరు రూ.1,08,000
గాయ‌త్రీ విద్యాప‌రిష‌త్, విశాఖ‌ప‌ట్నం రూ. 1,03,700
వీఆర్ సిద్ధార్థ కాలేజ్, విజ‌య‌వాడ రూ.1,02,000
జీఎంఆర్ఐటీ, రాజాం రూ.1,02,000
విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ విశాఖ‌ప‌ట్నం(వీఐవీపీ) రూ.99,000
శ్రీవిద్యానికేత‌న్ ఇంజినీరింగ్ కాలేజ్ రూ.97,800
గాయ‌త్రీ విద్యా ప‌రిష‌త్, ఉమెన్ రూ.97,600
ప్రసాద్ వి పొట్లూరు (పీబీ సిద్ధార్థ), విజ‌య‌వాడ రూ.97,000
ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌, భీమ‌వ‌రం రూ.95,000
విష్ణు ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఉమెన్‌), భీమ‌వ‌రం రూ.95,000
ఎన్‌బీకేఆర్‌, విద్యాన‌గ‌ర్ రూ.93,200
మ‌ద‌న‌ప‌ల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, మ‌ద‌న‌ప‌ల్లి రూ.93,000
రాజీవ్‌గాంధీ మెమోరియ‌ల్ కాలేజ్‌, నంద్యాల రూ.86,800
విజ్ఞాన్స్ లారా, వ‌డ్లమూడి రూ.85,400
ర‌ఘు ఇంజినీరింగ్ కాలేజ్, వైజాగ్‌ రూ.85,000
శ‌శి ఇంజినీరింగ్ కాలేజ్, తాడేప‌ల్లిగూడెం రూ.85,000
విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, భీమ‌వ‌రం రూ.85,000
కేఎస్ఆర్ఎం, క‌డ‌ప రూ.85,000
అన్న‌మాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, రాజంపేట రూ.84,900
ఎంవీఆర్ కాలేజ్‌, విజ‌య‌న‌గ‌రం రూ. 82,500
గుడ్లవ‌ల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ రూ.81,600
జి.పుల్లారెడ్డి, క‌ర్నూలు రూ.80,000
వాసిరెడ్డి వెంక‌టాద్రి, గుంటూరు రూ.80,000
జీఐఈఆర్‌, రాజ‌మండ్రి రూ.79,300
ల‌క్కిరెడ్డి బాల్‌రెడ్డి, విజ‌య‌వాడ రూ.78,800
ఆదిశంక‌ర‌, గూడురు రూ.77,000
అనిల్ నీరుకొండ‌- రూ.76,300
బాప‌ట్ల ఇంజినీరింగ్ కాలేజ్ రూ.75,000
నారాయ‌ణ‌, నెల్లూరు రూ.75,000
శ్రీవెంక‌టేశ్వర, చిత్తూరు రూ.75,000
ఆదిత్య, పెద్దాపురం రూ.75,000
శ్రీవెంక‌టేశ్వర‌, తిరుప‌తి రూ.73,900
ప్రగ‌తి, పెద్దాపురం రూ.72,800
సిద్ధార్థ, పుత్తూరు రూ.72,700
ఆదిత్య, టెక్కలి రూ.72,000

Published on 24.06.2016