Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీలు వాయిదా

* ప్రవేశాల హడావుడి నేపథ్యంలో నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో తనిఖీల్ని నిర్వహిస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పునరాలోచన జరపాలని యాజమాన్యాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వంతో సంప్రదించి తాత్కాలికంగా తనిఖీల్ని వాయిదా వేయాలని ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 4వ తేదీ నుంచి కమిటీ తనిఖీల్ని అనంతపురం జిల్లా నుంచి మొదలెట్టింది. తనిఖీల సమయంలో యథాలాపంగానే అనేక లోపాలు, నిబంధన్ల ఉల్లంఘన వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్ని జరగనీయకుండా కమిటీ ప్రతినిధుల్ని అడ్డుకునే ప్రయత్నాలూ జరిగాయని అనంతపురం జిల్లా నుంచి అందిన సమాచారాన్నిబట్టి తెలియవచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో తాము వచ్చినట్లు కమిటీ స్పష్టంచేసి ముందుకు సాగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా పరిశీలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం స్వాగతించింది.

Published on 07.07.2016