Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

12 నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2016-17 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని పలు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 12 నుంచి 17 వరకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.అనూరాధ తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ మెరిట్ ఆర్డర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌ల్లోని ఆన్‌లైన్ కేంద్రాల్లో అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల కౌన్సెలింగ్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Published on 07.07.2016