Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఇంజినీరింగ్ ప్రవేశాలకు 27904 మంది వెబ్ఆప్షన్లు

* నేటి నుంచి 45001 - 90 వేల ర్యాంకు వారికి అవకాశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారానికి 27904 మంది విద్యార్థులు తమ వెబ్ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు 29837 మంది హాజరవగా.. వీరిలో 27904 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటల వరకు 45001 నుంచి 90 వేల ర్యాంకు పొందిన విద్యార్థులు తమ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ ఎంవీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా విద్యార్థులకు లాగిన్ఐడీలని ఇప్పటికే నమోదు చేసిన మొబైల్ నెంబరుకు పంపించామని పేర్కొన్నారు.

Published on 07.07.2016