Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకర్లకు కేఎల్‌ వర్సిటీ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల కోసం విజయవాడ సమీపంలోని కేఎల్‌ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది. సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో మే 28న నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. తెలంగాణ సెట్‌లో 1 నుంచి 40వేల ర్యాంకులు వచ్చిన విద్యార్థులు జూన్‌ 11న నేరుగా విశ్వవిద్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని వెల్లడించారు. రిజర్వేషన్‌, ఓపెన్‌ కేటగిరీల్లో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఎ.హర్ష, యూనివర్సిటీ ప్రతినిధులు హెచ్‌ఎస్‌ఆర్‌ మూర్తి, చంద్రారావు పాల్గొన్నారు.

published on 29.05.2016