Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

మరో 9 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ తాజాగా మరో తొమ్మిది ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. వాటికి ఫీజులను ఖరారు చేస్తూ జులై 7వ తేదీ రాత్రి ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 24 జారీ చేసింది. దాంతో వాటిని కూడా కౌన్సెలింగ్‌లో చేర్చారు. ఇప్పటివరకు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య 197కు చేరింది. మరో మూడు బీ ఫార్మసీ కళాశాలలకు, ఒక ఫార్మా డి కళాశాలకు కూడా జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు ఇవ్వడంతో వాటికి ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాంతో బీఫార్మసీ కళాశాల సంఖ్య 80కి, ఫార్మా డి కళాశాలలు 30కి చేరుకున్నాయి.

Published on 09.07.2016