Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వెబ్‌ ఆప్షన్లకు 55,019 మంది

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో జులై 8న నాటికి మొత్తం 55,019 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరు మొత్తం 27,26,753 ఆప్షన్లు ఇచ్చారు. 45,001-90 వేల ర్యాంకర్లు జులై 9 ఉదయం 10 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి సమయం ఉంది. ఆ తర్వాత 90,001నుంచి చివరి ర్యాంకు వరకు జులై 10వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వారి ఫోన్లకు జులై 8న రాత్రి లాగిన్‌ ఐడీ పంపించామని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని కళాశాలలకు కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చామని, అదే మాదిరిగా జేఎన్‌టీయూహెచ్‌ కూడా మరికొన్ని కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చిందన్నారు.

Published on 09.07.2016