Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

లోపాలు దిద్దుకున్న కళాశాలలకు కౌన్సెలింగ్‌లో అవకాశం

* హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్‌: లోపాలు సరిదిద్దుకున్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు వెబ్‌ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం జేఎన్‌టీయూహెచ్‌కు జులై 8న ఆదేశాలు జారీచేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలన్నారు. 241 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం జేఎన్‌టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకోగా 158 కాలేజీలకే అనుమతి లభించింది. 83 కళాశాలలకు గుర్తింపు లభించలేదు. గుర్తింపు నిరాకరణకు గురైన సుమారు 15 కళాశాలలు కోర్టును ఆశ్రయించగా వాటిలో జులై 8న ఆరు కేసులు విచారణకు వచ్చాయి. వీటిలో మూడు కేసులకు సంబంధించి న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరాం జేఎన్‌టీయూహెచ్‌ గుర్తించిన లోపాలను సరిదిద్దుకున్న వాటికి వెబ్‌ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ఆదేశించారు. తనిఖీలు చేసి నిబంధనల ప్రకారం ఉంటేనే అవకాశం ఇవ్వాలన్నారు. మరో మూడు కేసుల విచారణను జులై 11కు వాయిదా వేశారు.

Published on 09.07.2016