Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

13వ తేదీ వరకు ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు!

* హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పొడిగించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మరో రెండు రోజులు పొడిగించే అవకాశముంది. గతంలో ప్రకటించిన మేరకు 9వ తేదీతో ముగియాలి. ఆప్షన్ల మార్పునకు 10, 11వ తేదీల్లో అవకాశమిస్తామని ప్రవేశాల కమిటీ అధికారులు మొదట్లో ప్రకటించారు. అయితే, కొన్ని మైనారిటీ కళాశాలలు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గడువును ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో శనివారమే కొన్ని మార్పులు కూడా చేశారు.
ఇవీ మార్పులు
* 90001 నుంచి చివరి ర్యాంకర్లు ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
* ఒకటి నుంచి చివరి ర్యాంకర్ల వరకు ఈనెల 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు తాజాగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇప్పటికే ఇచ్చిన ఆప్షన్లలో మార్పు చేసుకోవచ్చు.
ఆప్షన్లు ఇచ్చుకున్న 63,067 మంది
శనివారం వరకు మొత్తం 63,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం 68,118 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

Published on 10.07.2016