Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

బైపీసీ విద్యార్థులకు 'ఎంసెట్' ప్రకటన జారీ!

* 15-17 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ మెడికల్ రాసిన బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి, బీటెక్ బయోటెక్నాలజీలో చేరేందుకు ప్రవేశాల కమిటీ జులై 10న ప్రకటన జారీచేసింది. తెలంగాణ వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు 13 చోట్ల సహాయకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జులై 15 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. 15న 1-25 వేల ర్యాంకర్లకు, 16న 25001-50 వేలు, 17న 50001- చివరి ర్యాంకర్ల వరకూ హాజరవ్వాలి. 15-16వ తేదీ వరకు 1-25 వేల ర్యాంకర్లు, 16-17వ తేదీల్లో 25001-50 వేలు, 17-18వ తేదీ వరకు 50001- చివరి ర్యాంకర్లు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. 18న ఆప్షన్లను మార్చుకోవచ్చు. జులై 20న సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తెచ్చుకోవాల్సిన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవీ సీట్లు...
* బీఫార్మసీ - 2060
* ఫార్మా డి - 330
* బీటెక్ బయోటెక్నాలజీ - 42 (ఈ కోర్సులో చేరేవారు ఇంటర్‌లో గణితం బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి ఉండాలి)

Published on 11.07.2016