Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంసెట్ వెబ్ఆప్షన్లకు 13 వరకు గడువు

* 16న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు వెబ్ఆప్షన్ల నమోదుకు గడువును జులై 13న అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కన్వీనర్ ఎంవీ రెడ్డి జులై 10న వివరాలను వెల్లడించారు. వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం తర్వాత మధ్యలో మరికొన్ని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు అనుబంధ గుర్తింపు పొంది కౌన్సెలింగ్‌లో చేరాయి. ఈ క్రమంలో గడువును 12 నుంచి 13న అర్ధరాత్రి వరకు పొడిగించారు. 1 నుంచి చివరి ర్యాంకర్ల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన వాటిని మార్చుకోవచ్చు. సీట్లను జులై 16న కేటాయిస్తారు. జులై 10 వరకు 65,297 మంది మొత్తం 32,33,074 ఆప్షన్లు ఇచ్చుకున్నారు.

Published on 11.07.2016