Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

డిక్లరేషన్‌ ఫారంతో మార్కుల జాబితా పంపాలి

* ఏపీ ఎంసెట్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఆచార్య సాయిబాబు
కాకినాడ, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు డిక్లరేషన్‌ ఫారం కూడా డౌన్‌లోడ్‌ చేసుకుని ధ్రువీకరణ పత్రాలతో కలిపి తమకు పంపాలని ఏపీ ఎంసెట్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఆచార్య సాయిబాబు మే 28న ఓ ప్రకటనలో తెలిపారు. కొంతమంది విద్యార్థులు కేవలం డిక్లరేషన్‌ ఫారంగానీ లేకపోతే మార్కుల జాబితాగానీ మాత్రమే పంపుతున్నారన్నారు. అలా పంపిస్తే వాటిని పరిగణనలోకి తీసుకోమన్నారు. డిక్లరేషన్‌ ఫారంతో మార్కుల జాబితాను కలిపి పంపించాలన్నారు. అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మార్కుల వెయిటేజీని అనుసరించి ఎంసెట్‌ మార్కులతో కలిపి ర్యాంకులను మే 29న వెల్లడిస్తామన్నారు. ఆంధ్రా, తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డుల్లో పునర్‌ మూల్యాంకనం, పునర్‌ లెక్కింపునకు దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఫలితాలను తాము తీసుకుని ఏమైనా మార్పులుంటే వాటిద్వారా తుది ర్యాంకులు కూడా మే 29న ప్రకటిస్తామన్నారు.

published on 29.05.2016