Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

బైపీసీ స్ట్రీమ్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎన్‌జీ రంగా వర్సిటీ, న్యూస్‌టుడే: 2016-17 విద్యా సంవత్సరానికి వివిధ బైపీసీ స్ట్రీమ్ డిగ్రీ కోర్సులకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27 సాయంత్రం 4 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.

Published on 13.07.2016