Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఇంజినీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల భర్తీకి గడువు 31

* తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు విడుదల
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో బీ కేటగిరీ సీట్ల భర్తీని జులై 31వ తేదీలోపు ముగించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్దేశించింది. ఈ మేరకు 2016-17 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీకి మార్గదర్శకాలను వెబ్‌సైట్లో పొందుపర్చింది. ప్రతి కోర్సులో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీ చేసుకోవాలి. మిగతా 15 శాతం సీట్లను జేఈఈ ర్యాంకు ప్రాతిపదికన భర్తీ చేయాలి. అయినా సీట్లు ఖాళీ ఉంటే ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా, అప్పటికీ ఖాళీగా ఉంటే ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు (రిజర్వేషన్‌ ఉంటే 40 శాతం) ఉన్నవారికి కేటాయించవచ్చు. కళాశాలలు వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించాలి. దరఖాస్తును అప్‌లోడ్‌ చేసిన వారికి రసీదు ఇచ్చే ఏర్పాటు చేయాలి.. తదితర నిబంధనలను ఉన్నత విద్యామండలి పేర్కొంది. అయితే కొన్ని కళాశాలలు తప్ప ఇప్పటికే డిమాండ్‌ ఉన్న చాలా కళాశాలలు సీట్లను అమ్ముకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
http://tsche.cgg.gov.in/

Published on 13.07.2016