Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

మెడికల్‌ కౌన్సెలింగ్‌లో కులధ్రువీకరణ పరిశీలన కట్టుదిట్టం

రాజానగరం, న్యూస్‌టుడే: ఏపీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. తూ.గో.జిల్లా రాజానగరం మండలం పాలచర్లలో నిర్మించనున్న పీహెచ్‌సీకి జులై 13న ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కామినేని మాట్లాడుతూ.. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మెడికల్‌ సీట్లు పొందిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంబంధిత అభ్యర్థులు తమ జీవిత కాలంలో ఇక ఏ వైద్య కళాశాలలోనూ ప్రవేశం పొందకుండా కఠిన చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. మరోవైపు, చైనాలోని షాంఘైలో ఏర్పాటైన వైద్య పరికరాల తయారీ పార్క్‌పై అధ్యయనం చేసేందుకు మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యలు 16వ తేదీ నుంచి చైనాలో పర్యటించనున్నారు.

Published on 14.07.2016