Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

కొనసాగుతున్న ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వచ్చే విద్యాసంవత్సరానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ రెండో రోజు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఉభయ రాష్ట్రాల్లోని నాలుగు కేంద్రాల్లో 1501 నుంచి 4500 ర్యాంకుల వారికి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టగా రాత్రి 9 గంటల వరకు 2,122 మంది పత్రాల పరిశీలన పూర్తయిందని ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్‌ కేంద్రం క్యాంపస్‌ అధికారి డాక్టర్‌ మురళీమోహన్‌ తెలిపారు.

Published on 14.07.2016