Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా కొందరికి సీట్లు రావు

* ఇంజినీరింగ్‌లో సీట్ల కంటే ఆప్షన్లు ఇచ్చిన వారే అధికం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంజినీరింగ్‌కు సంబంధించి విద్యార్థులు ఎన్ని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నా మొదటి విడతలో అందరికీ సీట్లు దక్కని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం కన్వీనర్‌ కోటా సీట్ల కంటే సీటు కోరుతూ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారే అధికంగా ఉండటం. మొదటి విడతలో సీటు పొందాలంటే అధికంగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు. సీట్ల కంటే ఆప్షన్లు ఇచ్చుకున్నవారు 114 మంది ఎక్కువగా ఉన్నారు. ఇక తక్కువ సంఖ్యలో నమోదు చేసుకున్న వారికి అసలే కష్టం. ఈ యేడు జేఎన్‌టీయూహెచ్‌ భారీగా సీట్ల సంఖ్యకు కోత పెట్టిన విషయం తెలిసిందే. జులై 13న రాత్రి 12 గంటలతో వెబ్‌ ఆప్షన్ల గడువు ముగిసింది. జులై 16న సీట్లు కేటాయించనున్నారు.
కన్వీనర్ కోటా సీట్లు: 66,695
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు: 68,299
వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు: 66,809
మొత్తం ఆప్షన్ల సంఖ్య: 34,09,549
సగటున ఒక్కొక్కరు ఇచ్చుకున్న ఆప్షన్లు: 51

Published on 14.07.2016