Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

మందకొడిగా ధ్రువపత్రాల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వచ్చే విద్యాసంవత్సరానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ మూడో రోజున ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. ఉభయ రాష్ట్రాల్లోని నాలుగు కేంద్రాల్లో మెరిట్‌ఆర్డర్‌ 4501 నుంచి 9500 ర్యాంకుల వారికి జులై 14న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టగా, రాత్రి 9.30 గంటల వరకు 2623 మంది హాజరయ్యారని హెల్త్‌’వర్సిటీ కౌన్సెలింగ్‌ కేంద్రం క్యాంపస్‌ అధికారి డాక్టర్‌ మురళీమోహన్‌ తెలిపారు. జులై 15న 9501 ర్యాంకు నుంచి 18,000 ర్యాంకుల వరకు పరిశీలన ఉంటుంది.

Published on 15.07.2016