Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

16న ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు వివరాలు జులై 16న ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఎం.వి.రెడ్డి తెలిపారు. 11.30 నుంచి అభ్యర్థులు సీట్ల కేటాయింపు పత్రాలు, ఫీజు చెల్లింపు చలానాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఎంసెట్‌ (బైపీసీ) అభ్యర్థుల సీట్లకేటాయింపు జులై 20న చేయనున్నట్లు తెలిపారు. 25001 నుంచి 50వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు 18లోగా తమ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు.

Published on 16.07.2016