Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంబీబీఎస్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌కు 1900 మంది హాజరు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రలోని పలు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ సీట్ల ప్రవేశానికి సంబంధించి వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ అయిదో రోజు జులై 16న నాలుగు కేంద్రాల్లో 1900 సీట్లు భర్తీ అయ్యాయి. మెరిట్‌ ఆర్డర్‌ 18,001 నుంచి 30,000 ర్యాంకుల వారికి ధ్రువపత్రాల పరిశీలన జరిగిందని క్యాంప్‌ అధికారి మురళీమోహన్‌ తెలిపారు. జులై 17న చివరి రోజున ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 30,001 ర్యాంకు నుంచి ఆఖరి ర్యాంకుల వరకు పరిశీలన ఉంటుంది. అభ్యర్థుల అవస్థలు: కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు పలు అవస్థలుపడ్డారు. తాగునీరు అందుబాటులో లేక లీటరు రూ.20లకు కొనుగోలు చేసుకున్నారు. కుర్చీలు తగినన్ని లేవు. ఫ్యాన్లు లేక ఉక్కపోతతో అల్లాడారు.

Published on 17.07.2016