Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

21న వ్యవసాయ కోర్సుల కౌన్సెలింగ్

గుంటూరు, న్యూస్‌టుడే: ఎంపీసీ స్ట్రీమ్ కోర్సులకు ఈ నెల 21న స్పాట్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సత్యనారాయణ శనివారం తెలిపారు. బీటెక్‌లో అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఏపీ ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓపెన్ మాన్యువల్ ద్వారా కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. గృహ విజ్ఞాన కోర్సులకు ఎంసెట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండా మధ్యాహ్నం 2 గంటలకు స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. అభ్యర్థుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫాంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

Published on 17.07.2016