Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ముగిసిన వైద్య ప్రవేశాల ధ్రువపత్రాల పరిశీలన

* వెబ్ ఆప్షన్ల నమోదుకు త్వరలోనే నోటిఫికేషన్
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలు ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలల్లోని సీట్ల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఆదివారం (జులై 17)తో ముగిసింది. ఈ ఏడాది నుంచి వెబ్ఆధారిత కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. త్వరలోనే వెబ్ ఆప్షన్ల నమోదుకు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసి, విద్యార్థులకు మూడు రోజులు సమయం ఇస్తామని ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ అనూరాధ వెల్లడించారు. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీని కోసం ముందస్తుగా జులై 12 నుంచి 17 వరకూ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను చేపట్టారు. చివరిరోజున ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో మెరిట్ ఆర్డర్ 30,001 నుంచి ఆఖరి ర్యాంకు వరకూ 793 మంది విద్యార్థుల పత్రాలను పరిశీలించారు. జేఎన్‌టీయూలో 198, ఆంధ్రా వైద్య కళాశాలలో 133, ఎస్వీయూలో 176, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో 286 మంది పత్రాలను పరిశీలించారు.

Published on 18.07.2016