Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల

* కేంద్ర ప్రభుత్వ అనుమతి.. 150 సీట్లు మంజూరు
ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌లో 2016-17 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనుమతించింది. 150 సీట్లను మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి పత్రాన్ని పంపించింది. తెలంగాణలో కొత్త వైద్యకళాశాలను మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ సంవత్సర ఆరంభంలో నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. ఎంసీఐ బృందం పరిశీలన అనంతరం కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వరంగంలో హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లో కాకతీయ; నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ల్లో వైద్య కళాశాలలున్నాయి. వాటిలో 850 సీట్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ కూడా ఈ జాబితాలో చేరడంతో మొత్తం కశాశాలల సంఖ్య ఆరుకు చేరనుంది. సీట్ల సంఖ్య 1000 కానుంది. ఈ కళాశాలకు అవసరమైన పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. మంత్రి లక్ష్మారెడ్డి సీఎంను కలిసి వైద్యకళాశాలకు అనుమతి విషయాన్ని తెలిపారు. కళాశాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

published on 02.06.2016