Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

చివరి విడత ఎంసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రకటన జారీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ చివరి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌కు జులై 19న అధికారులు ప్రకటన జారీ చేశారు. గతంలో ప్రకటించినట్లుగా జులై 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన కాకుండా 24వ తేదీనే జరుపుతారు. మొదటి విడతలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోనివారు ఆ రోజు హాజరుకావొచ్చు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారు సైతం మొదటి విడతలోనే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావడంతో రెండు రోజులు అవసరం లేదని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని 21 సహాయ కేంద్రాల్లో ఎక్కడైనా పరిశీలనకు హాజరుకావొచ్చు. వెబ్‌ఆప్షన్లు మాత్రం 24, 25వ తేదీల్లో ఇచ్చుకోవచ్చు. సీట్ల కేటాయింపును జులై 27వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు.

Published on 20.07.2016