Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

23 నుంచి ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్

హైదరాబాద్: ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ జులై 23 నుంచి ప్రారంభం కానుందని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి జులై 19న ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన ఇంజినీరింగ్ సీట్లతో పాటు ఫార్మాడీ కోర్సులకూ ఈ విడతలో కేటాయింపు జరగనుంది. మొదటివిడతలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోని వారు జులై 23న ఆయా సేవా కేంద్రాల్లో పరిశీలన చేయించుకోవాలి. 24వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లకు గడువు ఉంది. 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థుల ఫోన్‌కు సంక్షిప్త సమాచార రూపంలో కేటాయింపు సీట్ల వివరాలు అందిస్తారు. పూర్తి వివరాలకు ఏపీ ఎంసెట్ వెబ్ సైట్ చూడవచ్చు.
https://apeamcet.nic.in/Default.aspx

Published on 20.07.2016