Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

చివరి విడతకు 26,106 సీట్లు

* 24 నుంచి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రెండో విడత ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇంజినీరింగ్‌తోపాటు బీఫార్మసీ, ఫార్మా డి సీట్లు కలుపుకొని మొత్తం 26,106 అందుబాటులో ఉండనున్నాయి. జులై 24 నుంచి చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. జులై 24న విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. జులై 24, 25 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం మరో మూడు ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఫీజు నిర్ణయిస్తూ జులై 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలలు రెండో విడత కౌన్సెలింగ్‌లో కలవనున్నాయి. ఇప్పటివరకు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య 200కి పెరిగింది. వాటితోపాటు బీఫార్మసీ, ఫార్మా డి కళాశాలలు ఒక్కోటి చొప్పున పెరిగాయి. మరోవైపు కళాశాలల్లో ఇప్పటికే రిపోర్ట్‌ చేసి చివరి కౌన్సెలింగ్‌లో పాల్గొనేవారు ప్రస్తుతం వచ్చిన కళాశాల, బ్రాంచి కంటే మెరుగైన వాటికే ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాలకమిటీ కన్వీనర్‌ ఎంవీరెడ్డి సూచించారు.
సీట్ల పరిస్థితి ఇలా..
తొలి విడతలో మిగిలిన సీట్లు: 11,183
కళాశాలల్లో చేరిన విద్యార్థులు: 44,420 (మొత్తం 57,940మందికి సీట్లు కేటాయించారు. అంటే 13,520 మంది మొదటి విడతలో సీట్లు వచ్చినా చేరలేదు)
చివరి విడతకు అందుబాటులో ఉండే సీట్లు: 26,106 (ఇంజినీరింగ్‌, బీఫార్మసీ, ఫార్మా డి కలిపి)
అదనంగా కలిసిన సీట్లు: 1403.

Published on 24.07.2016