Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

27, 28 తేదీల్లో మెడికల్‌ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

* ఆగస్టు ఒకటి నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు
విజయవాడ, న్యూస్‌టుడే: 2016-17 విద్యాసంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో పలు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులంతా జులై 27, 28 తేదీల్లో ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి విశ్వవిద్యాలయం జులై 25న నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆప్షన్లు ఎంచుకున్న వారికి 48 గంటల తర్వాత ఏయే కళాశాలల్లో ఏ తరహా సీటు వచ్చిందో ఆన్‌లైన్‌లో వెల్లడిస్తారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులంతా కళాశాలల్లో తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని జులై 23న విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ రవిరాజు తెలిపారు.
హెల్త్‌’వర్సిటీ అకడమిక్‌ సెనెట్‌ సభ్యుల నియామకం: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అకడమిక్‌ సెనెట్‌ సభ్యులుగా విజయవాడలోని డాక్టర్‌ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాలకు చెందిన డాక్టర్‌ కె.ఎం.వి.డి.ప్రసాద్‌, గుడివాడలోని ప్రభుత్వ హోమియో కళాశాలకు చెందిన డాక్టర్‌ సుధాకర్‌ బాబులను ప్రభుత్వం నియమించింది. వీరు మూడేళ్ల పాటు సభ్యులుగా కొనసాగుతారు.

Published on 24.07.2016