Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

29 నుంచి మెడికల్‌ వెబ్‌ఆప్షన్లు

* 2న కళాశాలల్లో సీట్ల కేటాయింపు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ల నమోదు జులై 29, 30, 31వ తేదీల్లో జరగనుంది. విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వెబ్‌ఆప్షన్ల ఎంపికను జులై 27, 28వ తేదీల్లో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే సాంకేతిక సహకారం అందిస్తున్న ఏపీ ఉన్నత విద్యామండలితో ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం జులై 24న నిర్వహించిన సమీక్ష సమావేశంలో కొన్ని మార్పులు చేశారు. వెబ్‌కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌నుజులై 25న విడుదల చేయనున్నందున అనంతరం కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలని సమీక్షలో నిర్ణయించారు. 25న నోటిఫికేషన్‌ విడుదలయ్యాక మూడు రోజుల తర్వాత 29 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్టు ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ టి.రవిరాజు వెల్లడించారు. ఒకరోజు తర్వాత ఆగస్టు 2వ తేదీన కళాశాలల్లో సీట్లు కేటాయిస్తూ జాబితాను విడుదల చేస్తారు.

Published on 25.07.2016