Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - 2013 Engineering Toppers Voice
  • రోబోటిక్స్‌లో పరిశోధన చేస్తా

    పల్లెర్ల సాయి సందీప్‌రెడ్డి, మొదటి ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 97.06
    ఎంసెట్‌ మార్కులు: 154
    ఐఐటీలో ర్యాంకు అంచనా: 1
      మొదటి నుంచీ నా గురి ఐఐటీపైనే. అందుకే ప్రథమ సంవత్సరం నుంచి ఎప్పటి పాఠ్యాంశం అప్పుడే చదువుకున్నా. రెండో సంవత్సరంలో ఇంటర్‌ పరీక్షలు, ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఒకేసారి మళ్ళీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, జేఈఈ, ఎంసెట్‌లకు సన్నద్ధం కావాలంటే విపరీతమైన భారం! అందుకే ప్రణాళికతో దాన్ని తప్పించుకున్నా.
  • కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేస్తా

    జి.సృజన్‌రాజు, రెండో ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 96.25
    ఎంసెట్‌ మార్కులు: 152
    ఐఐటీలో ర్యాంకు అంచనా: 50లోపు
      మా సొంతూరు శ్రీకాకుళం జిల్లా రాజాం. నాన్న హార్డ్‌వేర్‌ వ్యాపారి. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా. అమృత విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించా. బిట్స్‌ పరీక్షలో 411 మార్కులు పొందా. ఇంటర్‌ను వైజాగ్‌లోని శ్రీచైతన్య నారాయణ విద్యాసంస్థలో చదివా. ఇంటర్‌లో 100శాతం గ్రూపు మార్కులు సాధించా.
  • ఇంజినీరింగ్‌ రంగంలోనే స్థిరపడతా

    కొరగంజి గోకుల్‌, మూడో ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 96.17
    ఎంసెట్‌ మార్కులు: 152
    ఐఐటీ అంచనా ర్యాంకు: 100-200 మధ్య
      ఐఐటీ ముంబయిలో ఎలక్ట్రికల్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేస్తా. ఇంజినీరింగ్‌ రంగంలోనే స్థిరపడతా. మాది విజయవాడ దగ్గర. నాన్న వ్యవసాయం చేస్తాడు. ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల్లో 598 మార్కులు సాధించా.
  • కంప్యూటరు ఇంజినీరునవుతా

    కాటూరి సాయికిరణ్‌, నాలుగో ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.78
    ఎంసెట్‌ మార్కులు: 151
    ఐఐటీలో ర్యాంకు అంచనా: 300పైగా మార్కులు
      ఐఐటీలో చేరి కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదువుతా. మాది గుంటూరులోని బ్రాడీపేట. మా నాన్న కాంతారావు సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. మా అమ్మ మగ్గం పని చేస్తారు. ఐఐటీ మెయిన్స్‌లో 325 మార్కులతో 7వ స్థానంలో నిలిచా.
  • ఐఐటీ చెన్నైలో చదువుతా

    వై.జ్యోత్స్న, 5వ ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.78
    ఎంసెట్‌ మార్కులు: 151
    ఐఐటీ అంచనా ర్యాంకు: 3వేలు
      ఐఐటీ చైన్నెలో ట్రిపుల్‌ ఈ లేదా ఈసీఈ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేస్తా. ఇంజినీరింగ్‌ రంగంలోనే ఉండాలన్నది లక్ష్యం. మా సొంతూరు విశాఖపట్నం. నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల్లో 600కు 600 మార్కులు పొందా. బిట్స్‌ ప్రవేశ పరీక్షలో 362 మార్కులు సాధించా.
  • శాస్త్రవేత్తగా స్థిరపడతా

    వేముల వంశీకృష్ణ, 6వ ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.75
    ఎంసెట్‌ మార్కులు: 152
    ఐఐటీ అంచనా ర్యాంకు: 500లోపు
      ఐఐటీలోనూ మంచి ర్యాంకే వస్తుంది. అయినా పరిశోధనవైపు వెళ్లాలని ఆసక్తి. కిశోర్‌ వైజ్ఞానిక ప్రోత్సాహక యోజనలో (కేవీపీవై) జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు వచ్చింది. దాని ఆధారంగా బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌లో (బీఎస్‌) చేరతా. ఇప్పటికీ సీటు వచ్చింది. అక్కడ ప్రత్యేక బ్రాంచి ఉండదు. కేవలం బీఎస్‌ ఉంటుంది. తర్వాత పీహెచ్‌డీ చేసి శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తా.
  • ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా

    వేగుళ్ల క్రాంతి, 7వ ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.74
    ఎంసెట్‌ మార్కులు: 151
    ఐఐటీ ర్యాంకు అంచనా: 20-30 లోపు
      ఐఐటీ ముంబయి లేదా ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్‌ రంగంపై ఆసక్తి ఎక్కువ. సొంతూరు మిర్యాలగూడెం. నాన్న బిల్డర్‌. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశా. గ్రూపు సబ్జెక్టుల్లో 599 మార్కులు వచ్చాయి. బిట్స్‌ ప్రవేశ పరీక్షలో 450 మార్కులకు 410 మార్కులు పొందా.
  • ఐఏఎస్‌ లక్ష్యం

    కందుల దినేష్‌, 8వ ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.70
    ఎంసెట్‌ మార్కులు: 151
    ఐఐటీ అంచనా ర్యాంకు: 100-200 మధ్య
      ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా. తర్వాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలన్నది లక్ష్యం. ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల్లో 598 మార్కులు సాధించా. నాన్న ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
  • ఐఏఎస్‌ లక్ష్యం

    కందుల దినేష్‌, 9వ ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.70
    ఎంసెట్‌ మార్కులు: 151
    ఐఐటీ అంచనా ర్యాంకు: 100-200 మధ్య
      కంప్యూటర్‌ సైన్స్‌లో పరిశోధన చేయాలన్నది లక్ష్యం. అందుకే ఐఐటీ ముంబయిలో సీఎస్‌ఈ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేస్తా. ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల్లో 597 మార్కులొచ్చాయి. నాన్న ఏజీ కార్యాలయంలో, అమ్మ ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తారు.
  • సివిల్స్‌ రాస్తా

    బి.గౌరీశంకర్‌, 10వ ర్యాంకర్‌

    సంయుక్త స్కోర్‌: 95.61
    ఎంసెట్‌ మార్కులు: 151
    ఐఐటీ అంచనా ర్యాంకు: సుమారు 100
      మొదట ఐఐటీ ముంబయిలో సీఎస్‌ఈ లేదా ఈసీఈ బ్రాంచీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తా. తర్వాత సివిల్స్‌ వైపు దృష్టి సారిస్తా. ఇంటర్‌ గ్రూపు మార్కులు 596. మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. నాన్న అక్కడే పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.