Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - 2013 Medicine Toppers Voice
  • గుండె జబ్బుల్ని నయం చేస్తా..

    వడ్డవల్లి వెంకట వినీత్‌, వైద్య విభాగంలో రాష్ట్రంలో తొలి ర్యాంకు

    కంబైన్డ్‌స్కోరు: 99.06
    ఎంసెట్‌ మార్కులు: 158
      వైద్యుడిగా సేవలు అందించాలనేది నా చిరకాల స్వప్నం. అందుకే కష్టపడి చదివా. ఇటీవల గుండె సంబంధమైన సమస్యలు పెరిగి పొతున్నాయి. వాటిని నయం చేయడానికి వైద్యశాస్త్రంలో కార్డియాలజీ విభాగంలో చదవాలనుకుంటున్నాను. నాన్న ఆంజనేయులు 'ఈనాడు'లో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ అనురాధ. ఇద్దరూ నేను కష్టపడి చదవడానికి ఎంతో సహకరించారు.
  • 8వ తరగతిలోనే నిర్ణయం తీసుకున్నా..

    వై.రోహిత్‌ కుమార్‌, రెండో ర్యాంకు విద్యార్థి

    కంబైన్డ్‌స్కోరు : 98.55
    ఎంసెట్‌ మార్కులు : 157
      నాకు మొదటి నుంచీ జీవశాస్త్రం అంటే ఎంతో ఇష్టం. 8వ తరగతిలోనే డాక్టర్‌ కావాలని నిర్ణయం తీసుకున్నా... మాది విజయనగరం జిల్లాలోని అరసాడ గ్రామం. నాన్న మురళీకృష్ణ స్కూళ్లో టీచరు. అమ్మ చిత్రకారిణి. ఇద్దరూ నా చదువులకు ఎంతో చేశారు. నాలుగేళ్లుగా డాక్టర్‌ కావాలని కష్టపడి చదివా. వైద్యశాస్త్రంలో అడుగుపెట్టి గుండె జబ్బుల్ని నయం చేయాలనే లక్ష్యంతో ఎంసెట్‌ రాశా.
  • క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తా..

    ఎం.జగదీష్‌రెడ్డి, వైద్యవిభాగంలో మూడో ర్యాంకు విద్యార్థి

    కంబైన్డ్‌ స్కోరు: 98.51
    ఎంసెట్‌ మార్కులు: 157
      అంకాలజీలో పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నా. క్యాన్సర్‌ రుగ్మతలపై పరిశోధనలు చేయాలని అనుకుంటున్నాను. మాది ప్రకాశం జిల్లాలోని చీరాల. నాన్న అక్వాకల్చర్‌ చేస్తున్నారు. అమ్మ గృహిణి. మొదటి నుంచీ ఎంసెట్‌లో మూడోర్యాంకు రావాలని చాలా కష్టపడి చదివా. లక్ష్యం సాధించా.
  • కష్టమైన చదువే ఎంచుకుంటా..

    ఎస్‌.ఎస్‌.కె.వెంకటేశ్‌, నాల్గో ర్యాంకర్‌

    కంబైన్డ్‌ స్కోరు: 98.13
    ఎంసెట్‌ మార్కులు: 156
      వైద్య శాస్త్రంలో కార్డియాలజీ విభాగం ఎంతో కష్టతరమైంది. అది పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నా. గుండె సంబంధ సమస్యలకు పరిష్కారం చూపాలని భావిస్తున్నాను. మాది విశాఖపట్నం అమ్మ వైద్య వృత్తిలో ఉన్నారు. నాన్న ఉద్యోగి ఇక మీదట మరింత కష్టపడి చదవాలనుకుంటున్నాను.
  • న్యూరాలజీ ఎంపిక చేసుకుంటా..

    చేకూరి రిత్విక్‌, ఐదో ర్యాంకర్‌

    కంబైన్డ్‌ స్కోరు: 98.00
    ఎంసెట్‌ మార్కులు: 156
      నాన్న వరంగల్‌ ఎన్‌ఐటీలో ప్రొఫెసర్‌, అమ్మ వాగ్దేవీ కళాశాలలో అధ్యాపకురాలు. ఇద్దరూ చదువులో నన్నెంతగానో ప్రొత్సహించారు. చిన్నప్పటి నుంచి అమ్మను స్ఫూర్తిగా తీసుకుని చదువులుసాగిస్తున్నా. న్యూరాలజీ విభాగంలో వైద్యశాస్త్రం పూర్తి చేసి రోగులకు సేవ చేయాలనేది నా కోరిక.
  • తొమ్మిదో ర్యాంకు వస్తుందనుకున్నా..

    అవుతు ప్రవీణ, ఆరో ర్యాంకర్‌

    కంబైన్డ్‌ స్కోరు: 97.66
    ఎంసెట్‌ మార్కులు: 155
      ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంకు వస్తుందని ముందే వూహించా. కానీ అనూహ్యంగా ఆరో ర్యాంకు వచ్చింది. గత రెండేళ్లుగా ఎంతో కష్టపడి చదువుతున్నా... కర్నూలు జిల్లా వీరారెడ్డిపల్లెలో నాన్న శ్రీనివాసరెడ్డి వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. ఇద్దరూ నా చదువులకు ఎంతో సహకరించారు. మొదటి నుంచీ వైద్య శాస్త్రంలో యూరాలజీ చేయాలనేది నా లక్ష్యం.
  • ఐఏఎస్‌ కావాలనేదే లక్ష్యం

    నోముల గౌతంరెడ్డి, ఏడో ర్యాంకర్‌

    కంబైన్డ్‌స్కోరు: 97.61
    ఎంసెట్‌ మార్కులు: 155
      వరంగల్‌లో మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నకు చిన్న దుకాణం ఉంది. అమ్మ గృహిణి. ఇద్దరు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నాకు మెడిసిన్‌లో ఏడో ర్యాంకు వచ్చింది. కానీ నేను వైద్యుడిని కావాలనుకోవడం లేదు. ఐఏఎస్‌ అధికారి అవ్వాలనే లక్ష్యంతోనే చదువులు సాగిస్తున్నా. ఇది నాకు తొలి విజయం మరింత కష్టపడి చదవాలనుకుంటున్నా.
  • చండీగఢ్‌లో చేరడమే లక్ష్యంగా...

    సాయినాథం చిరంజీవి, ఎనిమిదో ర్యాంకర్‌

    కంబైన్డ్‌స్కోరు: 97.57
    ఎంసెట్‌ మార్కులు: 155
      మాది కడప జిల్లా నాగిరెడ్డిపల్లె. నాన్న అలిపిరి ఆర్టీసీ డిపోలో డ్రైవరు (తాత్కాలిక ఉద్యోగి), అమ్మ జయలక్ష్మి కుట్టు పని చేస్తారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను చండీగఢ్‌లో వైద్యశాస్త్రం చదవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. అక్కడ కార్డియాలజీలో చేరతా. మొదటి నుంచి టాప్‌ 10లో ర్యాంకు రావాలని కష్టపడి చదివా.
  • న్యూరో సర్జన్‌ కావాలని..

    సూరపనేని ప్రజ్ఞ, తొమ్మిదో ర్యాంకర్‌

    కంబైన్డ్‌స్కోరు: 97.53
    ఎంసెట్‌ మార్కులు: 155
      మాది హైదరాబాద్‌. అమ్మ డాక్టర్‌ పద్మావతి, నాన్న డాక్టర్‌ సురేష్‌. మొదటి నుంచీ నాకు ఈ వృత్తి అంటే ఎంతో గౌరవం. అందుకే నేనూ డాక్టర్‌ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా... నా కల నిజమైంది. న్యూరాలజీ చదవాలని నిర్ణయం తీసుకున్నా. నాకు ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
  • న్యూరోసర్జన్‌ కావాలని ఉంది

    కల్వపూడి సుకుమార్‌, 10వ ర్యాంకర్‌

    కంబైన్డ్‌స్కోరు: 97.47
    ఎంసెట్‌ మార్కులు: 155
      తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఎంసెట్‌లో ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్‌ కావాలనేది నా లక్ష్యం. మాది అమీర్‌పేట. చాలాకాలం అమెరికాలో ఉండి వచ్చా. మా నాన్న మురళీకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. అమ్మ రాధ గృహిణి. ఎంసెట్‌లో 20 లోపు ర్యాంకు వస్తుందని ముందే వూహించా. 10వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది.