Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - 2014 Engineering Toppers Voice
  • సాఫ్ట్‌వేర్‌ సంస్థ స్థాపిస్తా

    - నందిగం పవన్‌కుమార్‌ (మొదటి ర్యాంక్‌)

      ఇంట్లో తల్లితండ్రులు, కాలేజీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించా. కేవీపీవై ఫెలోషిప్‌ పొందా. ఎంసెట్‌లో 158 మార్కులు పొందడం సంతోషంగా ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలోనూ మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాను. ముంబయి ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించడం నా లక్ష్యం.
      కుటుంబ నేపథ్యం: హైదరాబాద్‌కి చెందిన పవన్‌ తండ్రి నారాయణరావు ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి. తల్లి దీప గృహిణి.
  • శాస్త్రవేత్త కావలన్నది నా కల

    - గుజ్జుల చాణుక్యవర్థన్‌రెడ్డి (రెండో ర్యాంక్‌)

      కాన్పూర్‌ ఐఐటీలో చదువుతున్న నా సోదరుడు హర్షవర్ధన్‌ స్ఫూర్తితోనే చదివా. రోజుకి 10 గంటలపాటు చదివేవాడిని. పరీక్షల ముందు ఒత్తిడి తగ్గించుకొనేందుకు ఆ సమయం తగ్గించుకొన్నా. ముంబయి ఐఐటీలో చదవాలనుకొంటున్నా. శాస్త్రవేత్త కావాలన్నది నా కల.
      కుటుంబ నేపథ్యం: స్వస్థలం ప్రకాశం జిల్లా తూర్పు గంగవరం. తండ్రి విజయభాస్కర్‌ వ్యాపారం చేస్తున్నారు. తల్లి సుశీల గృహిణి.
  • ఐఐటీ ముంబయిలో చదువుతా

    - లకుమారపు నిఖిల్‌కుమార్‌ (మూడో ర్యాంక్‌)

      భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించడం నా స్వప్నం. ఇరాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ జూనియర్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లో రజత పతకం సాధించాను. కేవీపీవై ఫెలోషిప్‌ అందుకున్నాను. కన్నవారు, కళాశాల అధ్యాపకులతోపాటు ఫిజిక్స్‌ అధ్యాపకుడైన బంధువు రాంబాబు ప్రోత్సాహమిచ్చారు. ఐఐటీ ముంబయిలో చదివాలనుకొంటున్నా. ఐటీ సంస్థను నెలకొల్పాలన్నది నా కల.
      కుటుంబ నేపథ్యం: మహబూబ్‌నగర్‌ జిల్లా ఆర్కపల్లి స్వస్థలం. తండ్రి పాండు ప్రస్తుతం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఆటోమొబైల్‌ విడిభాగాల దుకాణం నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి గృహిణి.
  • ఐఐటీలో మంచి ర్యాంకు వస్తుంది

    - నారు దివాకర్‌రెడ్డి (నాలుగో ర్యాంక్‌)

      ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదవాలన్నది నా కోరిక. ఐఐటీ ప్రవేశ పరీక్షలోనూ మంచి ర్యాంకు దక్కుతుందని భావిస్తున్నా. బిట్స్‌ పిలానీలో 434 మార్కులు వచ్చాయి. సింగపూర్‌లో నిర్వహించే ఆసియన్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కి మన దేశం నుంచి ఎంపికైన అయిదుగురులో నేనొకడిని.
      కుటుంబ నేపథ్యం: కర్నూలు జిల్లా వెంకటాపురం స్వస్థలం. తండ్రి ఆదినారాయణ విజయవాడ దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగి. తల్లి సుభద్ర గృహిణి.
  • ఐఏఎస్‌ చేయాలన్నదే లక్ష్యం

    - ఆదిత్యవర్ధన్‌ (అయిదో ర్యాంకు)

      ఇంటర్‌ ఎంపీసీలో 918 మార్కులు, జేఈఈ ప్రధానపరీక్షలో 336 మార్కులు పొందాను. కళాశాల తరగతుల కన్నా ప్రధానంగా ప్రామాణిక పుస్తకాలపై పట్టు సాధించగలిగా. అకాడమీ పుస్తకాలతో పాటు నిష్ణాతుల పుస్తకాలను చదవడం ద్వారా మంచి ర్యాంకును సాధించగలిగాను. రోజుకు 10-12 గంటలు చదువుకే కేటాయించా. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేసి ఐఏఎస్‌ చేయాలన్నది నా లక్ష్యం.
      కుటుంబ నేపథ్యం: విజయనగరం స్వస్థలం. తల్లిదండ్రులు శ్రీదేవి, మహేష్‌.
  • శాస్త్రవేత్త కావాలనుకొంటున్నా

    -పి.ప్రేమ్‌ అభినవ్‌ (ఆరో ర్యాంక్‌)

      కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విద్యను ఢిల్లీ ఐఐటీలో పూర్తి చేయాలనుకొంటున్నాను. శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. బిట్స్‌ పిలానీలో 382 మార్కులు సాధించా.
      కుటుంబ నేపథ్యం: విజయవాడ స్వస్థలం. తండ్రి శ్రీనివాస్‌ రైల్వేలో అధికారి. తల్లి సురేఖ గృహిణి.
  • అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే

    - బీరం అక్షయ్‌కుమార్‌రెడ్డి (ఏడో ర్యాంక్‌)

      ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశించా. ఐఐటీలో నాకు తప్పకుండా మంచి ర్యాంకు వస్తుంది. అమ్మానాన్నల ప్రోత్సాహం, అధ్యాపకుల సూచనలతో ఈ ర్యాంకు సాధించగలిగా. బిట్స్‌ పిలానీలో 380 మార్కులు సాధించా.
      కుటుంబ నేపథ్యం: మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు స్వస్థలం. తండ్రి మురళీధర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి శైలజ గృహిణి.
  • శాస్త్రవేత్తనవుతా

    - జి.సాయి కాశ్యప్‌ (ఎనిమిదో ర్యాంక్‌)

      ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో చదివి శాస్త్రవేత్త కావాలన్నది నా కల. కేవీపీవై ఫెలోషిప్‌ పొందా. బిట్స్‌ పిలానీలో 382 మార్కులు సాధించా.
      కుటుంబ నేపథ్యం: నల్గొండ స్వస్థలం. తండ్రి వెంకటేశ్వర్లు ఓ ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకుడు. తల్లి మాధవి గృహిణి.
  • వూహించలేదు

    - పి.సాయి సూర్య ప్రహర్ష (9వ ర్యాంకు)

      ముంబయి లేదా చెన్నైలోని ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదవాలన్నదే లక్ష్యం. నాకు 20లోపు ఏదో ఒక ర్యాంకు వస్తుందనుకున్నా. తొమ్మిదో ర్యాంకు వస్తుందని వూహించలేదు.
      కుటుంబ నేపథ్యం: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్వస్థలం. ప్రహర్ష తండ్రి దివాకర్‌ కోరుకొండ రోడ్డులో చిన్న పాన్‌షాపును నడుపుతున్నారు.
  • సివిల్‌ సర్వీసులకు వెళ్లాలని ఉంది

    - చింతకింది సాయిచేతన్‌ (పదో ర్యాంక్‌)

      ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక సివిల్‌ సర్వీసులకు ఎంపికై పేదలకు సేవ చేయాలని ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. ముంబయి ఐఐటీలో చేరాలన్నది నా ఆశ.
      కుటుంబ నేపథ్యం: స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా కొందుర్గు. తండ్రి సురేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏజీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఆడిటర్‌. తల్లి నిర్మల ఉపాధ్యాయురాలు..