Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

TS Eamcet - 2017 Engineering Toppers Voice
  • సివిల్స్‌కు ఎంపికై పేదలకు సేవ చేస్తా..

    - గోరంట్ల జయంత్‌ హర్ష, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మొదటి ర్యాంకు

      కృషి, పట్టుదలతోనే మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని పరీక్ష రాసిన రోజే అధ్యాకులకు, అమ్మానాన్నలకు చెప్పా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రాగా తెలంగాణ ఎంసెట్‌లో ప్రథమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నిత్యం 13 గంటలు చదివేవాణ్ని. ముంబయిలో సీఎస్‌ఈ చేయాలనుకుంటున్నా. బీటెక్‌ పూర్తి చేసి సివిల్స్‌ రాస్తా. ఎప్పటికైనా సివిల్‌ సర్వీసుకు ఎంపికై పేదలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మాది గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ముత్తానపల్లి.
  • అమ్మానాన్నల కష్టం వల్లే..

    - కిల్లారి రాంప్రసాద్‌, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ రెండో ర్యాంకు

      మా అమ్మానాన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ నన్ను కష్టపడి చదివించారు. వారికి మంచి పేరు తేవాలన్న లక్ష్యంతో పట్టుదలగా చదివా. రోజుకు 13 గంటలు చదవడంతో పాటు అధ్యాపకులు చెప్పిన పాఠాల్ని క్రమం తప్పకుండా సాధన చేసేవాడిని. జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 83వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో ఎనిమిదో ర్యాంకు వచ్చింది. ఆంధ్ర ఎంసెట్‌లో 188వ ర్యాంకు రాగా.. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో రెండో ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ముంబయి ఐఐటీలో కంప్యూటరు సైన్సు చదివి సొంతంగా సంస్థ నెలకొల్పాలన్నదే నా ఆశయం. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట.
  • తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే..

    - అవ్వారి సాయి ఎస్‌ఎస్‌వీ భరద్వాజ్‌, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మూడో ర్యాంకు

      తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు సాధించగలిగా. మాది భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గౌతమీనగరం. జేఈఈ మెయిన్స్‌లో అఖిల భారత స్థాయిలో 25వ ర్యాంకు వచ్చింది. ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు సాధించగా.. తెలంగాణలో మూడో ర్యాంకు వచ్చింది. రెండుచోట్లా ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది.