Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

TS Eamcet - 2017 Medicine Toppers Voice
  • ఎయిమ్స్‌లో చదవడమే లక్ష్యం

    - కడిమిశెట్టి నేస్తంరెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ మొదటి ర్యాంకు

      తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎయిమ్స్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నా. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని శ్రీనివాసనగర్‌. నాన్న నూకిరెడ్డి కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో ఇంజినీరుగా పనిచేస్తూ ఆరేళ్ల క్రితం మస్కట్‌ వెళ్లారు. చిన్నతనం నుంచి మేనమామ సత్యనారాయణరెడ్డి సంరక్షణలో ఉండి చదువుతున్నా.
  • నీట్‌ ర్యాంకును బట్టి మంచి కాలేజీలో చేరతా..

    - గొల్లమూడి ప్రదీత్‌సుందర్‌రెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ రెండో ర్యాంకు

      తెలంగాణ ఎంసెట్‌లో 160కి 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో 37వ ర్యాంకు వచ్చింది. త్వరలో రానున్న నీట్‌ ర్యాంకును బట్టి మంచి కళాశాలలో చేరి డాక్టర్‌ కావడమే లక్ష్యం. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. నాన్న మధుకిరణ్‌రెడ్డి న్యూరోసర్జన్‌. ఒంగోలులో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.
  • కార్డియాలజిస్ట్‌ను అవుతా..

    - అభినవ్‌రెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ మూడో ర్యాంకు

      తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో 77వ ర్యాంకు వచ్చింది. నీట్‌ పరీక్ష ద్వారా మెడిసిన్‌లో సీటు సాధించి కార్డియాలజిస్ట్‌ లేదా అంకాలజిస్ట్‌ అవుతా. ఎయిమ్స్‌ పరీక్షలో కూడా మంచి ర్యాంకు కోసం చదువుతున్నా. ఉపాధ్యాయులైన మా అమ్మ మంజుల, నాన్న శ్రీనివాసరెడ్డిల ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఏ రోజు పాఠ్యాంశాలను ఆరోజే పూర్తి చేస్తుంటా. కష్టపడి చదవడంతోనే ఈ ర్యాంకు సాధ్యమైంది. మాది సిద్దిపేట జిల్లా నంగునూరు.