
Toppers Voice
కంప్యూటర్ సైన్స్ చదువుతా * ముప్పిరాల విశ్వ విరించి (345 మార్కులు) 345 మార్కులతో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ శ్రీచైతన్య నారాయణ అకాడమీ(చైనా బ్యాచ్)లో ఇంటర్ చదివా. రెండో సంవత్సరంలో 511 మార్కులొచ్చాయి. ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సంపాదించాను. అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో కూడా ఉత్తమ ర్యాంకు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలన్నది లక్ష్యం. ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు ఈసీఐఎల్‌లోని కేకేఆర్ గౌతమ్‌లో చదివా. తొమ్మిది చదవకుండా 10వ తరగతిలోకి వెళ్లా. వయస్సు సరిపోకపోతే మినహాయింపు పొందా. నాన్న నరేంద్ర మహీంద్ర సత్యంలో ఉద్యోగం చేస్తున్నారు. |
![]() |
ఏరోనాటికల్ ఇంజినీరవుతా * ఓవిస్ ఖాన్ (341) మాది హైదరాబాద్‌లోని టోలిచౌకీ. ఎనిమిదో తరగతి వరకు సౌదీఅరేబియాలోని రియాద్‌లో చదువుకున్నా. ఆ తర్వాత ఇక్కడకు వచ్చి సీబీఎస్‌ఈ సిలబస్ చదివా. నాన్న సౌదీఅరేబియాలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఎంసెట్ కూడా రాస్తున్నా. ఐఐటీలో ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చదువుతా. శ్రీచైతన్య నారాయణలో ఇంటర్ చదివా. రెండు సంవత్సరాల్లో 973 మార్కులు సాధించా. |
![]() |
ఐఏఎస్ నా లక్ష్యం * రవిజగన్నాథ్ విశాల్ (340) స్వస్థలం చెన్నై. నా విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫిట్జీ బోధన సిబ్బంది సహకారం ఎంతో ఉంది. నాన్న రవి బాలసుబ్రహ్మణ్యం విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ప్రాజెక్టుల విభాగంలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ నా లక్ష్యం. |
![]() |
ఐఐటీలో చదువుతా * లీనా మాధురి, (331) ఇంటర్ వరకు సొంతూరు తిరుపతిలో చదివా. శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేసి చైతన్య నారాయణ బ్యాచ్‌లో చేరా. ఐఐటీలో లక్ష్యంగా సిద్ధమవుతున్నా. అడ్వాన్స్‌డ్‌లో వందలోపు ర్యాంకు సాధిస్తానన్న నమ్మకం ఉంది. నాన్న తిరుపతిలోని ల్యాంకో కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరంలో 521 మార్కులొచ్చాయి. |
![]() |
50 లోపు ర్యాంకు లక్ష్యం * మీసాల వెంకట కళ్యాణ్ (326) ఇంటర్‌ను విజయవాడలో చైతన్యనారాయణ బ్యాచ్‌లో చదివా. ఇంటర్ రెండో సంవత్సరంలో 515 మార్కులు సాధించా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తప్పకుండా 50 లోపు ర్యాంకు తెచ్చుకుంటా. నాన్న కాకినాడలో రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా మంగళాపురం. |
![]() |
కంప్యూటర్ సైన్స్‌లో చేరతా * పవన్ ఆర్ హెబ్బర్ (322) స్వస్థలం కర్ణాకటలోని కార్వార్. పదో తరగతి వరకు అక్కడే చదివా. ఇంటర్‌ను హైదరాబాద్‌లో చైతన్య నారాయణ బ్యాచ్‌లో పూర్తిచేశా. ఇంటర్ రెండో సంవత్సరంలో 511 మార్కులు పొందా. అడ్వాన్స్‌డ్‌లో 200 లోపు ర్యాంకు వస్తుందని నమ్మకముంది. ఐఐటీలో చేరతా. నాన్న కైగాలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో చేస్తున్నారు. |
![]() |
ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతా * అభయ్ రాజేంద్ర ఢాగా, (324) మా సొంతూరు మహారాష్ట్రలోని వర్ద. తల్లిదండ్రులు వైద్యులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ చదువు బాగుంటుందని హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేశా. ఇంటర్ రెండో సంవత్సరంలో 509 మార్కులు దక్కించుకున్నా. ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతా. |
![]() |
ఈఈఈ చదువుతా * తోటా వెంకటసాయి ధీరజ్, (323) బొంబాయి ఐఐటీలో ఈఈఈ చదువుతా. అడ్వాన్స్‌డ్ పరీక్షలో 100 లోపు ర్యాంకు సాధిస్తా. అదే లక్ష్యంగా సిద్ధమవుతున్నా. ఇంటర్ రెండో సంవత్సరంలో 522 మార్కులొచ్చాయి. మేం హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఉంటాం. నాన్న మధు.. బొల్లారం పారిశ్రామికవాడలో విద్యుత్తు పరికరాలు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నారు. |
![]() |
100లోపు ర్యాంకు వస్తుంది * పృథ్వీరాజ్ కొలన్ (323) మెయిన్‌లో సాధించిన మార్కులతో 25 లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నా. అడ్వాన్స్‌డ్‌లో 100 లోపు ర్యాంకు సాధిస్తా. ఇంటర్‌ను విజయవాడ సమీపంలోని గూడవల్లిలో చైతన్య నారాయణ బ్యాచ్‌లో చదివా. ఇంటర్ రెండో సంవత్సరంలో 518 మార్కులొచ్చాయి. హైదరాబాద్ ఉప్పల్‌లో ఉంటున్నాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. కొత్త పరీక్ష విధానం వల్ల అయోమయం ఏమీ లేవు. గతంలో ఏఐఈఈఈ ఉండేది. ఇప్పుడు జేఈఈ మెయిన్ ఉంది. అంతే తేడా. |
![]() |
ఈసీఈ నా లక్ష్యం * సూర్యతేజ (326) హైదరాబాద్‌లో నారాయణ కళాశాలలో చదివా. ఇంటర్‌లో 972 మార్కులు సాధించా. నా విజయం వెనుక అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ఈసీఈ చేయాలనేది నా లక్ష్యం. |
![]() |
ఏఐఈఈఈ ఇంజినీరింగ్ విభాగంలో ఆలిండియా టాపర్ సందీప్ పత్రి ఏఐఈఈఈ ఇంజినీరింగ్ విభాగంలో అఖిలభారత స్థాయిలో ఇంజినీరింగ్ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్ ప్రతి మొదటి ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని శ్రీ చైతన్య బ్రాంచీలో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నానని అక్కడి శిక్షణా విధానం డిఫరెంట్‌గా ఉందని తెలిపాడు. కోచింగ్ పూర్తయ్యే సమయానికి కచ్చితంగా ర్యాంక్ కొడతాననే నమ్మకం కలిగిందని తెలియజేశాడు. తల్లి, దండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సూచనలు, సబ్జెక్టుల రివిజన్ తన విజయానికి కారణమని తెలిపాడు. |
![]() |
సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి! * ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్' 'ఏ పోటీ పరీక్షలోనైనా, వార్షిక పరీక్షల్లోనైనా అత్యధిక మార్కులు సాధించాలంటే సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలని' ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్' అన్నారు. ఇటీవల ప్రకటించిన ఏఐఈఈఈలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు అందుకున్న నేపథ్యంలో 'న్యూస్‌టుడే'తో తన విజయ విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాలు... |
![]() |
|---|