ఇంజినీరింగ్ కళాశాలల్లో గత సంవత్సరం 3,06,925 సీట్లు ఉండగా.. ఈ సంఖ్య 2012-13 విద్యా సంవత్సరానికి 3,41,000 చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎ.ఐ.సి.టి.ఇ.) 2012-13 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సుల నిర్వహణకు, అదనపు సీట్లకు ఆమోదం తెలిపిన వివరాలు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖకు దాదాపుగా అందాయి. |
|
సాధారణంగా ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కోర్సులు ఉంటాయి. కొన్ని కళాశాలల్లో మాత్రమే ఇతర కోర్సులు ఉంటున్నాయి. ఎ.ఐ.సి.టి.ఇ. నుంచి తాజా సమాచారాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కమిషనర్ అజయ్‌జైన్ అందించారు. కౌన్సెలింగ్ నిర్వహణ సమయానికి కళాశాలల వారీగా కోర్సులు, సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అధికారికంగా కౌన్సెలింగ్ నిర్వహణకు ముందు ప్రభుత్వం వెల్లడించనుంది. ఇంజినీరింగ్ కళాశాలలు, కోర్సుల వారీగా పేర్కొన్న ఈ తాజా సమాచారంతో వచ్చే అవగాహన ద్వారా వెబ్ ఆప్షన్ల నమోదులో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే తాజా వివరాలను అందిస్తున్నాం. |