Toppers Voice


వీఆర్ఓ/వీఆర్ఏ
భోజనం.. నిద్ర లేవు
* శిష్టు చిట్టిబాబు (వీఆర్ఓ ఫస్ట్ ర్యాంక్)
వీరఘట్టం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం అని చెప్పారు. అకస్మాత్తుగా దాన్ని ఇచ్చాపురానికి మార్చారు. మా గ్రామం నుంచి ఏడుగంటల ప్రయాణం. అందుకే ముందురోజు బయల్దేరి అష్టకష్టాలు పడి ఇచ్ఛాపురం చేరుకున్నా. ఆ రాత్రి భోజనం లేదు.. కంటిమీద కునుకు లేదు.. రాత్రంతార దోమల బాధ. తెల్లారితే పరీక్ష. స్నానం, టిఫిన్ ఏమీ లేవు. ఎలాగైతేనేం పరీక్ష రాశా. రాష్ట్రస్థాయిలోనే ప్రథముడిగా నిలిచా. ఇపుడు చాలా ఆనందంగా ఉంది.
* వీఆర్వో పరీక్షల్లో రాష్ట్రస్థాయిలోనే ప్రథముడిగా నిలిచిన శిష్టు చిట్టిబాబు చెప్పిన మాటలివి. ఇతనిది వీరఘట్టం మండలం తలవరం గ్రామం. తన ప్రతిభ ద్వారా కన్నవారికి ఉన్న ఊరికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.
చిట్టిబాబుది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు స్వగ్రామం తలవరంలోనే పూర్తయింది. ఇంటర్మీడియెట్ వీరఘట్టం, డిగ్రీ అనకాపల్లి, ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీ, బీఈడీ నంద్యాల్లో పూర్తిచేశారు. తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు, అచ్చన్నమ్మలు పెద్దగా చదువుకోలేదు. అయినా తమ ఏకైక కుమారుడు చిట్టిబాబును నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారు. అతను ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించారు. కుటుంబసభ్యులైన డి.వేణు కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, కె.గీత, కె.మురళీమోహన్, సరస్వతి ఆర్థికంగా ఆదుకున్నారు.
పూర్వానుభవమే విజయానికి కారణం.
వీఆర్వో పరీక్షలకు చిట్టిబాబు ప్రత్యేకంగా తర్ఫీదు పొందలేదు. ఇందుకోసం ప్రత్యేక సమయాన్నీ కేటాయించలేదు. గతంలో గ్రూప్-2, డీఏవో పరీక్షలకు రెండేళ్లపాటు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయం సాధించలేకపోయాడు. ఆ అనుభవంతోనే వీఆర్వోపరీక్షలు రాశారు. డీఏవో పరీక్షలో అర్ధమేటిక్, రీజినింగు అంశాలు వీఆర్వో పరీక్షలో అక్కరకొచ్చాయి. ఈ విభాగంలో 38 మార్కులు సాధించారు. గ్రూప్-2లో తర్ఫీదు పొందిన జనరల్ స్టడీస్ ఈ పరీక్షలో బాగా ఉపయోగపడింది. ఈ విభాగంలో 55 మార్కులు సాధించగలిగారు. మొత్తం 93 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథముడిగా నిలిచారు.గ్రూప్-2లో విజయం సాధించి ఉపతహశిల్దారు కావాలన్నదే ఇప్పటికి తన లక్ష్యమని చిట్టిబాబు చెబుతున్నారు. ష్యమని చిట్టిబాబు చెబుతున్నారు.
TOP
విద్యావలంటీరు సాధించిన విజయం
నారాయణపురం(మందస): మందస మండలంలోని నారాయణపురం పంచాయతీ మల్లేనవారిపేటకు చెందిన మల్లేన నాగేశ్వరరావు వీఆర్వో నియామక పరీక్షలో 3వ ర్యాంకు సాధించారు. 1 నుంచి 10వ తరగతి వరకు హరిపురం, బాలిగాం ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్ శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో చదివిన నాగేశ్వరరావు డిగ్రీ (బీఎస్సీ గణితం) పలాస ప్రజ్ఞ కళాశాలలో పూర్తి చేశారు. ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితులు సహకరించక నాగేశ్వరరావు గ్రామంలోని పాఠశాలలో విద్యా వలంటీరుగా పని చేస్తూ తాజాగా వీఆర్వో పరీక్షకు హాజరయ్యారు. ఎలాగైనా ఉద్యోగం పొందాలన్న పట్టుదలతో శిక్షణ తీసుకొని పరీక్షరాశారు.
'మొదట్నుంచీ వీఆర్వో పరీక్షలో విజయం సాధిస్తానన్న నమ్మకముంది.. అదిలా సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంద'ని నాగేశ్వరరావు 'న్యూస్‌టుడే'తో సంతోషాన్ని పంచుకున్నారు. 100కు 87 మార్కులు సాధించిన నాగేశ్వరరావు 'నా జీవిత లక్ష్యం.. సివిల్స్. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక.. ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తా ' అన్నారు. వీఆర్వో పరీక్షకు ఆరో తరగతి నుంచి టెన్త్ వరకూ పాఠ్య పుస్తకాలు, కరెంట్ అఫైర్స్‌కు విజేత కాంపిటీషన్స్ పుస్తకాలు, పత్రికలు చదివా.. అని వివరించారు.
లక్ష్యం దిశగా ముందడుగు
* రాజేష్ కుమార్ ( వీఆర్ఓ రెండోర్యాంకు)
సింగుపురం(రామలక్ష్మణకూడలి): గ్రూప్స్ లక్ష్యంగా ప్రయత్నించిన రాజేష్‌కుమార్ వీఆర్ఓ పరీక్షలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం వచ్చినా వదిలేసి... గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకొని సాధన చేపట్టారు. వీఆర్ఓ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని సింగుపురం కొత్త దేవాంగుల వీధికి చెందిన రాజేష్ వీఆర్వో పరీక్షలో 87 మార్కులు సాధించాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజేష్ బీఎస్సీ బీఈడీ చదువుకున్నారు.
పదోతరగతి వరకు సింగుపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదివి 414 మార్కులు సాధించాడు. మునసబుపేట గాయత్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువును పూర్తి చేశాడు. చదువు కొనసాగుతుండగానే మధ్యలో 2001లో ఎయిర్ ఫోర్సు ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించి, వారికి సేవ చేసేందుకు అవకాశం ఉన్న కొలువే కావాలనుకొని తన ఉద్యోగానికి రాజీనామాచేశాడు. అనంతరం బీఈడీ చదువు పూర్తి చేశాడు. అనంతరం గ్రూప్స్‌కు సాధన మొదలుపెట్టి.. 2008లో గ్రూప్-2 రాసిన రాజేష్ కుమార్‌కు నిరాశే ఎదురయింది. గ్రూప్-4లో తొమ్మిదో స్థానంలో నిలిచినా.. అప్పుడు ఓపెన్‌లో మూడింటినే తీయడంతో అవకాశం రాలేదు. ఒక సారి చేతికొచ్చిన అవకాశం వదిలేసి.. రెండు సార్లు నిరాశ ఎదురైన రాజేషకుమార్‌కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా తన లక్ష్యం వైపు ముందుకు సాగారు. దీంతో తాజాగా నిర్వహించిన వీఆర్ఓ పరీక్షకు హాజరై సత్తాచాటారు.
లక్ష్యం గ్రూప్-2
* వీఆర్‌వో రాష్ట్ర రెండో ర్యాంకర్ వీరబాబు
కోదాడ: భవిష్యత్తులో గ్రూప్-2 సాధించడమే లక్ష్యమని నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన వీరబాబు అన్నారు. వీఆర్‌వో పరీక్షలో 92 మార్కులు సాధించి రెండో ర్యాంకర్‌గా నిలిచిన ఈయన ప్రస్తుతం కోదాడలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) 3 వ సంవత్సరం చదువుతున్నారు. టాప్ 10 లో ఉండొచ్చని ఊహించాననీ టాప్ - 2 లోనే స్థానం లభించడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తోందని వీరబాబు 'న్యూస్‌టుడే' విలేకరికి తెలిపారు. వాగ్దేవి విద్యా సంస్థల ఛైర్మన్ వెంకటరెడ్డి, తన బాబాయి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ర్యాంక్ అందుకోగలిగినట్లు చెప్పారు.
గ్రూప్ 2 సాధిస్తా...
* వీఆర్వో 8వ ర్యాంకర్ ఏమిరెడ్డి రాజేందర్‌రెడ్డి
గుర్రంపోడు: గ్రూప్ 2 సాధించడమే లక్ష్యం. మాది కనగల్ మండలం ఏమిరెడ్డిగూడెం. గ్రూప్2 కు సాధన చేస్తూ వీఆర్వో ఉద్యోగానికి పరీక్షలు రాశాను. అన్న ఎలేందర్‌రెడ్డి, తమ్ముడు ఉపేందర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులే. నేను కూడా గ్రూప్2 ద్వారా ఉన్నత ఉద్యోగం సాధించాలని భావిస్తున్నా. తండ్రి మోహన్‌రెడ్డి సాధారణ రైతు. తల్లి లలితమ్మ గృహిణి. డిగ్రీ వరకు నల్గొండలో, పీజీ హైదరాబాదులో పూర్తి చేశాను.
TOP