బడ్జెట్ నివేదికలు - 2012 - 13

కేంద్ర బడ్జెట్ 2012 - 13
విత్తమంత్రి ఈసారి కూడా వేతన జీవులను పెద్దగా పట్టించుకోలేదు. నామమాత్రంగా పరిమితి పెంచి, శ్లాబులను సవరించి.. అదే మహాభాగ్యం అనుకోమన్నారు. ఆర్థిక మంత్రిగా జీవితం అంత తేలికేమీ కాదంటూ.. మంచి కోసం కఠినంగా వ్యవహరిస్తానని నవ్వుతూనే చెప్పారు. కనిష్ఠంగా... రూ. రెండు వేలు, గరిష్ఠంగా రూ.22 వేల పన్ను ప్రయోజనాన్ని చూపించారు.

ప్రత్యక్ష పన్నుల విభాగాన్ని పరిశీలిస్తే.. 2012-13 బడ్జెట్‌లో కీలకమైన ప్రతిపాదనలేమీ లేవనే చెప్పొచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కనీస ఆదాయ పరిమితి రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. More ->>

రాష్ట్ర బడ్జెట్ 2012 - 13
ఈ సంవత్సర (2012 - 2013) రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫిబ్రవరి 17న అసెంబ్లీకి సమర్పించారు. రూ. 1,45,854 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 54,030 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ. 91,824 కోట్లు. ద్రవ్యలోటు రూ. 20,009 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
¤     గత ఏడేళ్ల సగటు వృద్ధిరేటులో జాతీయ సగటు (8.64 శాతం) కంటే రాష్ట్రం ముందంజ (9.26 శాతం)లో ఉంది.More ->>
రైల్వే బడ్జెట్ 2012-13
రైల్వే మంత్రి దినేష్ త్రివేది మార్చి 14, 2012న లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దశాబ్దకాలం తర్వాత అన్ని కేటగిరీల రైలు ఛార్జీలు పెరిగాయి. ప్రయాణ ఛార్జీలను పెంచడానికి గత పదేళ్ల కాలంలో ఏ రైల్వే మంత్రీ సాహసించలేదు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే ఏకంగా రూ. 4,500 కోట్ల ఛార్జీల భారం మోపి సంచలనం సృష్టించారు.More ->>
ఆర్థిక సర్వే 2011 - 2012
కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు ఆధారమైన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మార్చి 15, 2012న పార్లమెంట్‌కు సమర్పించారు. సాధారణ బడ్జెట్‌ను ప్రతిపాదించడానికి ఒకరోజు ముందు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించడం ఆనవాయితీ. 
       దేశ ఆర్థికవ్యవస్థ అంతర్లీనంగా ఎదుర్కొంటున్న కష్టాలను పేర్కొంటూ పన్నుల్లో సంస్కరణలు అవసరమని, సబ్సిడీ భారాలను తగ్గించుకోవాలని,  అధిక పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించాలని ఆర్థిక సర్వే ప్రభుత్వానికి సూచించింది.More ->>
రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2011 - 12
రాష్ట్ర ప్రభుత్వం 2011-12 సామాజిక ఆర్థిక సర్వేను ఫిబ్రవరి 17, 2012న శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో వృద్ధి రేటు గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోయింది. 2010-11లో వృద్ధి రేటు (2004-05 స్థిర ధరల సూచి ప్రకారం) 9.96 శాతం ఉంటే 2011-12లో 6.81 శాతానికి పడిపోయింది. కొన్నేళ్లుగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రేటుతో పోలిస్తే ఎంతో ముందున్న రాష్ట్రం ఈసారి మాత్రం వెనకబడిపోయింది. 2011-12 జాతీయ వృద్ధిరేటు 6.88 శాతం కావడం గమనార్హం. More ->>