హావభావాలు అతిముఖ్యం

భావ వ్యక్తీకరణలో భాష.. హావభావాలు చాలా ప్రధానం. తాజా అధ్యయనం మేరకు భాష వల్ల 7శాతం మాత్రమే భావ వ్యక్తీకరణ జరిగితే హావభావాల ప్రభావం 55 శాతం మేర ఉంటోంది. ఉద్యోగ వేటలో ఉన్నవారు, ఉద్యోగులకు హావభావాలు చాలా కీలకం. ముఖాముఖి, సమావేశాలు, కార్యాలయాల్లో వీటికి అత్యంత ప్రాధాన్యం ఉంటోంది. వీటిలో తేడాలు ప్రతికూల ఫలితాలకు దారితీస్తాయి. కనుక ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి. తెలుసుకోండి మరి. ఎక్కువ మంది చేస్తున్న తప్పులు మీరు చేయకుండా జాగ్రత్తపడండి.

సమావేశాల్లో..

భుజాలు పైకి ఎత్తడం మీరు ఎక్కువ ఒత్తిడికి గురౌతున్నట్లు తెలియజేస్తుంది. అలా కాకుండా ఎప్పుడూ కిందికే ఉంచాలి. దీని వల్ల కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు.
* మాట్లాడుతున్నపుడు సందర్భానుసారం చేతుల కదలిక చాలా ముఖ్యం. కట్టేసినట్లు ఉంచకూడదు. జేబుల్లో పెట్టుకోకూడదు. మాట్లాడుతున్నపుడు ముఖానికి అడ్డంగానూ రాకుండా చూసుకోవాలి. నోటికి అడ్డుగా చేతిని పెట్టుకొని మాట్లాడకూడదు.
* మాట్లాడుతున్నపుడు వాటికి ఇతరులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని గమనించాలి. సమావేశంలో తక్కువ మంది ఉంటే ఒక్కొక్కరిని చూస్తూ మాట్లాడాలి.

ఇంటర్వ్యూలో

ఆత్మవిశ్వాసం ఇతరులకు తెలిపేందుకు చక్కని కరచాలనం అవసరం. ఇది మీపై సానుకూల ముద్రపడేలా చేస్తుంది.
* చేతులు కట్టుకోవడం, కాళ్లు ముడుచుకోవడం సరికాదు.
* కూర్చొనేటపుడు, నిల్చొనేటపుడు రెండు కాళ్ల మధ్య దూరం కాస్త ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలి.
* కాళ్లు, చేతులు కదలకుండా ఉండాలి. ఆందోళనతో చేతులు వణకుండా ప్రశాంతంగా ఉంచాలి.
* స్వరం బిగ్గరగాను, చాలా తక్కువగాను ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా మాట్లాడాలి.
* ముఖాముఖిలో అవతలి వ్యక్తి హావభావాలనూ గమనించాలి. అప్పుడే వాటికి తగినట్లు మీరూ స్పందిచే వీలుంటుంది.
* కూర్చొన్నపుడు అరచేతులు పైకి కనిపించేలా ఉంచాలి. ముడుచుకోకూడదు.
* ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని కాకుండా.. దిక్కులు చూస్తూ కూర్చొంటే అది అవతలి వ్యక్తిని అగౌరవపరచినట్టౌంది. దృష్టిఎప్పుడూ మాట్లాడుతున్న వ్యక్తివైపే ఉండాలి.
* అవతలి వారు చెబుతున్నది బాగా వినాలి.

మౌఖిక పరీక్షకు వెళ్లే ముందు..

హావభావాలు అతిముఖ్యం

మాట్లాడు చక్కగా