నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్ఈ)

ఎంపిక విధానం:

ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది స్టేజ్ -1. ఇది రాష్ట్ర స్థాయి పరీక్ష. విద్యార్థులు తాము పదో తరగతి చదువుతున్న రాష్ట్రంలో నిర్దేశించిన కేంద్రంలో పరీక్షకు హాజరు కావచ్చు. ఈ దశలో అర్హత సాధించిన వారికి స్టేజ్ -2 (జాతీయ స్థాయి) పరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్ -1 పరీక్ష విధానం (స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్)
ఇది పూర్తి ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. దీన్లో రెండు భాగాలుంటాయి. అవి.

ఎ) మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్)

90 కంపల్సరీ ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాలు

బి) స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)

90 కంపల్సరీ ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాలు

ప్రశ్నకు 1 మార్కు. స్టేజ్-1 పరీక్ష ఎవాల్యుయేషన్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం పర్యవేక్షిస్తుంది..

సిలబస్:
1) మెంటల్ ఎబిలిటీలో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఇస్తారు.

దీన్లో ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, బ్లాక్ అసెంబ్లీ, ప్రాబ్లమ్ సాల్వి ంగ్ అంశాలపై ప్రశ్నల ఇస్తారు.

2) రెండో పేపర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనమిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను ఇస్తారు.

* ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి ఎలాంటి ప్రశ్నలను మొదటి స్టేజ్‌లో ఇవ్వరు.

ఫలితాల వెల్లడి:

స్టేజ్-1 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడిస్తుంది. అర్హులైన వారికి తమ దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వివరాలను పంపుతారు.

స్టేజ్ -2 కు రాష్ట్రం నుంచి ఎంత మందిని పంపుతారు?

ఏపీలో నిర్వహించే స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన 295 మంది విద్యార్థులకు స్టేజ్-2 (ఎన్‌టీఎస్ఈ) రాసే అవకాశం లభిస్తుంది. గత ఏడాది (2011) స్టేజ్-1 పరీక్షకు మొత్తం 38,000 మంది హాజరయ్యారు.

స్టేజ్ -2: నేషనల్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (జాతీయ స్థాయి పరీక్ష).

మొదటి దశలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా రెండు భాగాలుంటాయి. అవి.

1) మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్).

2) స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్).

సిలబస్:

దీనికి ప్రధానంగా సీబీఎస్ఈ 9, 10, 11 తరగతుల విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన సోషల్ స్టడీస్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టేజ్-2 ఫలితాలను ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటిస్తుంది.
తుది ఎంపిక:

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.