Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వెబ్‌సైట్‌లో ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) రాత పరీక్ష ఫలితాలు
కొత్తగూడెం(సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణిలో ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) రాతపరీక్ష జూన్ 14న కొత్తగూడెంలోని 5 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. 3,473మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. Read more
నియామకాల సంఖ్యను పెంచుతూ సింగరేణి నోటిఫికేషన్
కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణిలో రెండో నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఖాళీల సంఖ్యను 234 నుంచి 471కి పెంచుతూ సింగరేణి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. Read more
కొలువులు సిద్ధం.. కావాలి సన్నద్ధం
* సింగరేణి సంస్థలో ఉద్యోగాలకు పోటాపోటీ
* సాధనకు మెలకువలు చెబుతున్న నిపుణులు

శ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్లు, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ ఈ-2లో ఫైనాన్స్‌ అండ్‌ అక్కౌంట్స్‌, మైనింగ్‌ పరీక్షలు నిర్వహించింది. సివిల్‌ ఇంజినీరింగ్‌, పర్సనల్‌ విభాగాలకు యాజమాన్యం హాల్‌ టిక్కెట్లు జారీ చేసింది. Read more
అన్నింటా పట్టు.. విజయపు మెట్టు
* పలు సబ్జెక్టులపై అవగాహన తప్పనిసరి
* జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల ప్రిపరేషన్‌పై సింగరేణి అధికారుల సూచనలు

కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణిలో 26 సంవత్సరాల తర్వాత జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. 1989 సంవత్సరంలో నోటిఫికేషన్‌ ద్వారా 350మంది జూనియర్‌ అసిస్టెంట్‌లను తీసుకొన్న సింగరేణి ఇన్నేళ్ల తర్వాత తిరిగి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. Read more
ఎక్కు పెట్టు.. ఉద్యోగం పట్టు
* ముంచుకొస్తోంది పరీక్ష సమయం
* సూచనలు పాటిస్తే ఉపాధి
* 15 రోజుల్లో 1178 ఖాళీలకు నియామకాలు గ్యారంటీ

(గోదావరిఖని, న్యూస్‌టుడే): తెలంగాణ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ఉద్యోగాలకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. మరో 15 రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు సింగరేణి ఏర్పాట్లు చేస్తోంది.. అభ్యర్థుల హాల్‌ టికెట్ల తయారీలో నిమగ్నమైంది.. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష రాయలంటే ఉత్కంఠే. సాధారణ పరీక్షలు వేరు.. Read more
సింగరేణిలోని కొలువులకు సిద్ధంకండి ఇలా..
* అభ్యర్థులకు సింగరేణిలోని ఇంజినీర్ల సూచనలు
న్యూస్‌టుడే-కోల్‌బెల్ట్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మితమవుతున్నాయి. వాటికి సరిపడా బొగ్గు అందించాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు యాజమాన్యం కొత్తగా బొగ్గు తవ్వకాలపై దృష్టి పెట్టింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించింది. చకచకా అడుగులు వేస్తోంది. Read more
సింగరేణిలో కొత్తగా 796 ఖాళీల నియామకానికి ప్రకటన
* 1178 ఖాళీల భర్తీకి ఏప్రిల్ మూడో వారంలో రాత పరీక్ష
గోదావరిఖని: సింగరేణిలో మరిన్ని కొలువుల భర్తీకి ప్రకటన వెలువడింది. గతంలో విడుదల చేసిన 1178 ఖాళీల నియామకానికి ఏప్రిల్ మూడో వారంలో రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లుచేస్తుండగా; తాజాగా మరో 779 ఖాళీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. Read more
సింగరేణి కాలరీస్‌- ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పరీక్ష సిలబస్, విధి విధానాలు..
సింగరేణిలో కొలువుల జాతర మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత 1178 ఖాళీలను భర్తీ చేసేందుకు సింగరేణి ప్రకటన విడుదల చేసింది. స్థానికత ఆధారంగా కొన్ని ఉద్యోగ నియామకాలను రిజర్వు చేయగా, మరి కొన్ని స్థానికేతరులకు కూడా ఈ ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు. Read more

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 1178 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ ఇంజినీరింగ్‌ ట్రెయినీ, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఆకర్షణీయమైన వేతనాలు, సదుపాయాలను కల్పించే ఈ కొలువులను అందిపుచ్చుకోవడానికి ఉద్యోగార్థులు కృషి ఆరంభించాలి.
'ఒక కుటుంబం, ఒక దార్శనికత, ఒక లక్ష్యం' మకుటంగా కొనసాగుతోంది సుప్రసిద్ధ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌. 125 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ సంస్థ మార్కెట్‌ సవాళ్ళూ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉద్యోగ నియామకాలకు సిద్ధమైంది. భద్రత, నాణ్యత, అత్యధిక ఉత్పాదకతలే ప్రమాణాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది సింగరేణి. అధునాతన సాంకేతికతను అమలు చేస్తూ తొమ్మిది కొత్త గనులు/ ప్రాజెక్టులను ఆరంభించటానికి ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ నేపథ్యంలోనే నియామకాలు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ అర్హతలున్నవారు సంబంధిత స్పెషలైజేషన్‌ చేసివుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ పోస్టులు? ఎన్ని?
ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు
* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మైనింగ్‌- పురుషులకు మాత్రమే): 100 పోస్టులు
అర్హతలు: 55% మార్కులతో బీఈ/ బీటెక్ (మైనింగ్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఈ అండ్‌ ఎం - పురుషులకు మాత్రమే): 67 పోస్టులు
అర్హతలు: 55% మార్కులతో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) చదివి ఉండాలి.
* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సివిల్‌): 10 పోస్టులు
అర్హతలు: 55% మార్కులతో బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (పర్సనెల్‌- పురుషులకు మాత్రమే): 40 పోస్టులు
అర్హతలు: 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (హెచ్ ఆర్/ ఎం.హెచ్.ఆర్.డీ) లేదా ఎంబీఏ (హెచ్ ఆర్) లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివి ఉండాలి.
* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఎఫ్‌ అండ్‌ ఏ): 18 పోస్టులు
అర్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ.
నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు...
* జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రెయినీ (పురుషులకు మాత్రమే): 811 పోస్టులు
అర్హతలు: డిప్లొమా (మైనింగ్ ఇంజినీరింగ్)
* అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ (మెకానికల్‌ - పురుషులకు మాత్రమే): 72 పోస్టులు
అర్హతలు: డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్)
* అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌ - పురుషులకు మాత్రమే): 60 పోస్టులు
అర్హతలు: డిప్లొమా (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)
ఎంపిక విధానం: అభ్యర్థులకు తెలుగు భాషలో పరిజ్ఞానం అవసరం. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన మార్గదర్శక సూత్రాలను పాటించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏ పోస్టుకైనా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తే ప్రతిభను అనుసరించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసే హక్కు సంస్థకు ఉంటుంది. రాతపరీక్షలో మెరుగైన ప్రతిభ చూపినవారిని కొలువులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11
చివరితేది: ఫిబ్రవరి 25
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: మార్చి 4.
చిరునామా: జనరల్ మేనేజర్ (పర్సనల్)/ ఈఈ & ఆర్ సీ, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రిక్రూట్ మెంట్ సెల్, కొత్తగూడెం 507 101, ఖమ్మం జిల్లా (తెలంగాణ రాష్ట్రం).

Published on 16-02-2015