: HOME I COMPETITIVE EXAMS I ENTRANCE EXAMS I ACADEMIC EXAMS
 
 
 
 
 

 
I - CET TOPPERS  

2012 ఐసెట్ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ జయప్రకాశ్‌చారి

ఐసెట్ - 2012 ప‌రీక్షలో హైద‌రాబాద్‌కు చెందిన జయప్రకాశ్‌చారి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ కైవ‌సం చేసుకున్నాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి విజ‌యం సాధించాడు. ఈ విజయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిద‌ని, భ‌విష్యత్తుల్లో రాయ‌బోయే ఇత‌ర పోటీ ప‌రీక్షల‌కు స్పూర్తి పొందాన‌ని చెప్పాడు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనేదే త‌న ల‌క్ష్యమ‌ని తెలిపాడు. చ‌దువు విష‌యంలో త‌న త‌ల్లి దండ్రులు ఎక్కడ రాజీ ప‌డ‌లేద‌ని వారి ప్రోత్సాహంతోనే ఏ లక్ష్యాన్నైనా సాధించగలన‌నే ధైర్యం త‌న‌లో పెరిగింద‌ని చెప్పాడు.
జయప్రకాశ్‌చారి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్యాక్ట్‌సెట్ కంపెనీలో ఫైనాన్షియల్ డేటా ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. మ్యాట్ తో పోల్చుకుంటే ఐసెట్ సిలబస్ త‌క్కువ‌గా ఉండ‌టంతో రోజుకు రెండుగంటల చొప్పున పరీక్షకు ప్రిపేర‌య్యాన‌ని తెలిపాడు.
ఎలాంటి కోచింగ్ లేకుండా కేవ‌లం టెక్ట్స్‌బుక్స్‌తోపాటు ఇత‌ర‌ పుస్తకాలు చ‌ద‌వ‌డం, ఐసెట్ పాత పరీక్ష ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్‌చేయ‌డం వల్ల పరీక్షవిధానం, పరీక్షలో ఏవిధంగా ప్రశ్నలు అడుగుతున్నారు అనే విష‌యంపై అవగాహ‌న వచ్చిందని తెలిపాడు.