Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
     ప్రభుత్వ రంగానికి చెందిన‌ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 323 స్కేల్ వ‌న్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏవో) పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఈ మ‌ధ్య‌నే ఎన్ఐఏసీఎల్ 509 ఏవో పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. ఒకే త‌ర‌హా ప్రిప‌రేష‌న్‌తో ఈ రెండు ప‌రీక్ష‌ల‌నూ ఎదుర్కోవ‌చ్చు. అలాగే బ్యాంక్ ప‌రీక్ష‌లకు సిద్ధ‌మ‌వుతున్న‌వారు కూడా యునైటెడ్ ఇండియా పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని ప్ర‌యోజ‌నం పొందొచ్చు. ఎందుకంటే ఈ ప‌రీక్ష‌ల‌న్నింటోనూ ఉమ్మ‌డి అంశాల నుంచే ప్ర‌శ్న‌లడుగుతారు. ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 323 (ఎస్సీ 45, ఎస్టీ 21, ఓబీసీ 87, యూఆర్ 170, పీడ‌బ్ల్యుడీ 7). వీటిలో 243 జ‌న‌ర‌లిస్ట్ పోస్టులు. మిగిలిన 80 స్పెష‌లిస్ట్ పోస్టులు
విభాగాల‌వారీ:
జ‌న‌ర‌లిస్ట్: 243 ఏవో పోస్టులు
విద్యార్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
ఫైనాన్స్‌: 60
విద్యార్హ‌త‌: బీకాం, ఎంకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌) సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ. వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 10
విద్యార్హ‌త‌: బీఈ/ బీటెక్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త (మెకానిక‌ల్ ఇంజినీరింగ్ అభ్య‌ర్థులైతే డిప్లొమా స్థాయిలో క‌నీసం ఏడాదిపాటు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చ‌దివుండాలి)
లీగ‌ల్‌: 10
విద్యార్హ‌త‌: న్యాయ‌విద్య‌లో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
నోట్‌: పై అన్ని పోస్టుల‌కు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రి.
వ‌యోప‌రిమితి: అక్టోబ‌ర్ 1, 2014 నాటికి క‌నీసం 21 ఏళ్లు, గ‌రిష్ఠంగా 30 ఏళ్ల‌లోపు ఉండాలి. (అక్టోబ‌ర్ 2, 1984 కంటే ముందు అక్టోబ‌ర్ 1, 1993 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. రెండు తేదీల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.) గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యుడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు, భ‌ర్త చ‌నిపోయిన‌, విడాకులు పొంది ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు తొమ్మిదేళ్లు; ఎక్స్ స‌ర్వీస్మెన్ అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌ల మేర‌కు వ‌యో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్య‌ర్థుల‌కు రూ.వంద‌, మిగిలిన వాళ్ల‌కు రూ.500
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 29, 2014 నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌ర్ 18, 2014
ఎంపిక విధానం: స్క్రీనింగ్ ప‌రీక్ష‌, మెయిన్ ఎగ్జామ్‌, డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ద్వారా
స్క్రీనింగ్ ప‌రీక్ష‌: డిసెంబ‌ర్ 28,29 తేదీల్లో ఉంటుంది.
మెయిన్ ప‌రీక్ష‌, డిస్క్రిప్టివ్ టెస్ట్: జ‌న‌వ‌రి 2015లో మూడు, నాలుగు వారాల్లో నిర్వ‌హిస్తారు.
ఇంట‌ర్వ్యూలు: ఫిబ్ర‌వ‌రి 2015లో ఉంటాయి.
హాల్ టికెట్లు: ఆయా ప‌రీక్ష‌ల‌కు ప‌ది రోజుల ముందు నుంచి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఎంపికైతే:
నెల‌కు రూ.37,000 వేత‌నంగా ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం బేసిక్ పే రూ.17240గా ఉంది. కొద్ది నెల‌ల్లో కొత్త వేత‌న స్కేలు అమలులోకొస్తుంది. స‌వ‌రించిన వేత‌న స్కేలుతో నెల‌కు సుమారు రూ.50,000 ఆశించ‌వ‌చ్చు.ఏడాది పాటు ప్రొబేష‌న్ ఉంటుంది. ఈ వ్య‌వ‌ధిలో ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించే లైసెన్షియేట్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణ‌త సాధించాలి. ఏడాదిపాటు అద‌న‌పు గ‌డువు ఉంటుంది. ఈ వ్య‌వ‌ధిలోనూ పూర్తిచేయ‌లేకపోతే స‌ర్వీస్ నుంచి తొల‌గిస్తారు. ప్రొబేష‌న్‌తో క‌లుపుకొని మొత్తం నాలుగేళ్లు ప‌నిచేస్తామ‌ని అభ్యర్థి ఉద్యోగంలో చేరిన‌ప్పుడు ఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాలి.
ఎంపిక విధానం ఇలా...
ముందుగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ ప‌రీక్ష‌ను డిసెంబ‌ర్ 28, 29 తేదీల్లో నిర్వ‌హిస్తారు. ప్ర‌తి కేట‌గిరీ, విభాగంలో ఉన్న పోస్టుల‌కు ప‌ది రెట్ల సంఖ్య‌లో అభ్య‌ర్థుల‌ను మెయిన్స్, డిస్క్రిప్టివ్‌ ప‌రీక్ష‌కు ఎంపిక చేస్తారు. ఈ ప‌రీక్ష‌లు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. అభ్య‌ర్థి డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌లో త‌ప్ప‌నిస‌రిగా అర్హ‌త సాధించాలి. అయితే ఈ ప‌రీక్ష‌లో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ (మెయిన్ ఎగ్జామ్‌)లో సాధించిన మార్కుల‌ను బ‌ట్టి కేట‌గిరీ, విభాగాల వారీ ఖాళీల‌కు మూడు రెట్ల సంఖ్య‌లో అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూల‌కు ఎంపికైన‌వాళ్ల‌కు రెండోత‌ర‌గ‌తి రైలు లేదా బ‌స్సు ఛార్జీల‌ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మెయిన్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.
స్క్రీనింగ్ టెస్ట్ ఇలా...
ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ ఎబిలిటీ అంశాల నుంచి ప్ర‌శ్న‌ల‌డుగుతారు. మొత్తం వంద మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. వంద ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప‌రీక్ష వ్య‌వ‌ధి ఒక గంట‌. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్ర‌శ్న‌లు 30 మార్కుల‌కు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్ర‌శ్న‌లు 35 మార్కులు, రీజ‌నింగ్ ఎబిలిటీ 35 ప్ర‌శ్న‌లు 35 మార్కుల‌కు ఉంటాయి.
మెయిన్ ఎగ్జామ్ (జ‌న‌ర‌లిస్ట్ పోస్టుల‌కు)
మొత్తం 200 మార్కుల‌కు ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. 200 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప‌రీక్ష వ్య‌వ‌ధి 2 గంట‌లు. రీజ‌నింగ్ 50, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ( ఆర్థిక రంగంపై ప్ర‌త్యేక ఫోక‌స్‌) 40, కంప్యూట‌ర్ లిట‌ర‌సీ నుంచి 20 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు.
మెయిన్ ఎగ్జామ్ (స్పెష‌లిస్ట్ పోస్టుల‌కు)
మొత్తం 200 మార్కుల‌కు ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. 200 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప‌రీక్ష వ్య‌వ‌ధి 2 గంట‌లు. రీజ‌నింగ్ 40, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూట‌ర్ లిట‌ర‌సీ రెండూ క‌లిపి 40, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ( ఆర్థిక రంగంపై ప్ర‌త్యేక ఫోక‌స్‌) 40, అభ్య‌ర్థి స్పెష‌లైజేష‌న్‌కు సంబంధించిన విభాగం ( లీగ‌ల్‌/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌/ ఫైనాన్స్‌) నుంచి 40 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు.
నోట్‌: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్ర‌శ్న‌ప‌త్రాలు ఇంగ్లిష్ మాధ్య‌మంలో ఉంటాయి.
డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌లో...
ఎస్సే రైటింగ్‌/ ప్రెసీ రైటింగ్, లెట‌ర్ రైటింగ్ నుంచి 2 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప‌రీక్ష వ్య‌వ‌ధి 30 నిమిషాలు. ఈ విభాగానికి మార్కులు కేటాయించ‌లేదు.
స్క్రీనింగ్ టెస్ట్ ప‌రీక్ష కేంద్రాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో: చీరాల‌, శ్రీకాకుళం, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, కాకినాడ‌, చిత్తూరు, కంచిక‌చెర్ల‌, గుడ్ల‌వెల్లూరు, ఏలూరు, విజ‌య‌న‌గ‌రం.
తెలంగాణ‌లో: హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ కేంద్రాలు; క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం.