Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

     

ఇంటెలిజెన్స్ బ్యూరోలోజూనియ‌ర్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్(టెక్నిక‌ల్‌) గ్రేడ్‌-2 విభాగంలో 320 పోస్టుల భ‌ర్తీకి కేంద్ర మాన‌వ వ‌న‌రుల విభాగం ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక‌చేస్తారు. ఆస‌క్తి ఉన్నవాళ్లు సెప్టెంబ‌రు 24లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఉద్యోగానికి ఎంపికైతే దేశంలో ఎక్కడైనా ప‌నిచేయాల్సి ఉంటుంది. దివ్యాంగులు ఈ ఉద్యోగాల‌కు అన‌ర్హులు. పోస్టుల‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు: 320
విభాగాల‌వారీ: జ‌న‌ర‌ల్ 190, ఓబీసీ 43, ఎస్సీ 57, ఎస్టీ 30.
విద్యార్హత‌: ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి రేడియో టెక్నీషియ‌న్ లేదా ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ వీటిలో ఏదైనా రెండేళ్ల వ్యవ‌ధితో ఇండ‌స్ట్రియ‌ల్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. సెప్టెంబ‌రు 24, 2016లోగా పాసైన‌వాళ్లే అర్హులు.
వ‌యోప‌రిమితి: సెప్టెంబ‌రు 24, 2016 నాటికి 18-27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో సడ‌లింపులు వ‌ర్తిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌.
పే స్కేల్‌: రూ. 5200-20200 గ్రేడ్ పే రూ.2400. (ఏడో వేత‌న సంఘం సిఫార‌సుల ప్రకారం ఈ స్కేల్‌లో మార్పులు ఉంటాయి)

ప‌రీక్ష ఇలా...
పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ స్టడీస్‌/ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, సైన్స్‌, రీజ‌నింగ్‌..అంశాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. ఉంటాయి. వీటికి 80 మార్కులు. ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో అడుగుతారు. పేప‌ర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. పార్ట్ ఎలో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, పార్ట్ బిలో ఇంగ్లిష్‌కు సంబంధించి అర్థాలు, వ్యతిరేక‌ప‌దాలు, ఖాళీల‌ను స‌రైన ప‌దాల‌తో పూరించ‌డం త‌దిత‌ర ప్రశ్నలు వ‌స్తాయి. పార్ట్ సిలో మ్యాథ్స్‌, సైన్స్ అంశాల‌పై ప్రాథ‌మికాంశాల్లో ప్రశ్నల‌డుగుతారు. పేప‌ర్‌-2కి కూడా 80 మార్కులు కేటాయించారు. మొత్తం 2 గంట‌ల వ్యవ‌ధిలో ప్రశ్నప‌త్రాన్ని పూర్తిచేయాలి.
40 మార్కులు ట్రేడ్ టెస్ట్‌కి కేటాయించారు. మొత్తం 200 మార్కుల‌కు ఈ ప‌రీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక ఇలా..
పేప‌ర్‌-1లో క‌టాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల పేప‌ర్‌-2 ప‌త్రాల‌ను మూల్యాంక‌నం చేస్తారు. అనంత‌రం వీరి పేప‌ర్‌-1, పేప‌ర్‌-2 మార్కుల‌ను క‌లిపి మెరిట్, విభాగాల వారీ ఖాళీల ప్రకారం జాబితాను త‌యారుచేస్తారు. ఇలా ఎంపికైన‌వారికి ట్రేడ్ ప‌రీక్ష రాసే అవ‌కాశం క‌ల్పిస్తారు. పేప‌ర్ 1, 2, ట్రేడ్ టెస్టు మార్కుల‌ను క‌లిపి తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ విధానంలోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ప‌రీక్ష ఫీజు: రూ.50. జ‌న‌ర‌ల్‌, ఓబీసీ విభాగాల‌కు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, మ‌హిళ‌లు ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 24
ఎస్‌బీఐ ద్వారా ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 27

Posted on 07-09-2016

Reference Books
  • » IB ACIO Guide by R. Gupta
  • » Bharti Pariksha (Hindi) by Pratiyogita Sahitya
  • » Bharti Pariksha (Hindi) by Lal & Jain
  • » ACIO Practice work book by Kiran Prakashan