Intelligence Bureau (ACIO)

ఐబీలో 1300 అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో 1300 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌ చేసింది. 
ఖాళీల వివ‌రాలు: అన్ రిజ‌ర్వ్‌డ్‌ - 951, ఓబీసీ - 184, ఎస్సీ - 109, ఎస్టీ - 56
పే స్కేల్‌: రూ.9300 - 34800 + గ్రేడ్ పే రూ.4200
విద్యార్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తోపాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.
వ‌యోప‌రిమితి: 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో సడ‌లింపులు వ‌ర్తిస్తాయి)
ఎంపిక విధానం: టైర్ - 1, టైర్‌ - 2 ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూ ద్వారా

నియామ‌కం ఇలా..
టైర్‌ - 1లో అర్హత సాధించిన‌వాళ్లకే టైర్‌ - 2 ప‌రీక్ష నిర్వహిస్తారు. టైర్‌-1, టైర్-2లో చూపిన ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. టైర్‌-1, టైర్‌-2, ఇంట‌ర్వ్యూ ఈ మూడింటిలోనూ చూపిన ప్రతిభ ద్వారా మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 12.08.2017 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02.09.2017 
ప‌రీక్ష ఫీజు: రూ.వంద. మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. 
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌.

మౌఖిక పరీక్ష:
అభ్యర్థి వేసుకున్న దుస్తులు, శుభ్రత, ఆకారం, ప్రదర్శించే విషయాల దగ్గర్నుంచి అన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. అడిగిన ప్రశ్నకు సూటిగా, అర్థమయ్యేలా సమాధానం చెప్పటం ప్రధానం. తెలియని విషయాలను చెప్పాలనే ప్రయత్నం సరికాదు.
అన్ని విభాగాల్లో వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందేలా ప్రణాళిక పాటించాలి. అవసరమైన మెటీరియల్‌ సేకరించి, సబ్జెక్టుపై పట్టు సాధించటం; వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన... ఇవి చేయగలిగితే చాలు. కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడవచ్చు!
ఇలా సన్నద్ధమవుదాం
టైర్‌-1 పరీక్ష:
జనరల్‌ ఇంటలిజెన్స్‌: వెర్బల్‌ -నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌, హైలెవల్‌ రీజనింగ్‌ ప్రశ్నలుంటాయి. క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌లోని అడ్రస్‌ మ్యాచింగ్‌ ప్రశ్నలు కూడా వస్తాయి. సబ్జెక్టుపై శ్రద్ధపెట్టి తగిన సమయం కేటాయించాలి. సాధన చేయాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌: సమాజంలో చుట్టూ జరుగుతున్నవాటిపై ప్రశ్నలను అడగటం ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ముఖ్యంగా సైన్స్‌, సాంఘిక అంశాలైన చరిత్ర, ఆర్థికం, భౌగోళికం, రాజ్యాంగ వ్యవస్థలపై ప్రశ్నలు వస్తాయి. సైన్స్‌, చరిత్ర ప్రశ్నలకు ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ విశేషాలు, వర్తమాన అంశాలు కూడా ముఖ్యం.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: దీనిలో అరిథ్‌మెటిక్‌, మేథమేటిక్స్‌, డేటా అనాలిసిస్‌ అంశాలుంటాయి. అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలను రోజువారీ దినచర్యల్లో జరిగే ప్రశ్నలుగా ఆలోచించి, సామాజిక కోణంలో చూస్తే జవాబులు తేలికవుతాయి. సూక్ష్మీకరణపై దృష్టిపెడితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: గ్రామర్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, యాంటనిమ్స్‌, సిననిమ్స్‌, క్లోజ్డ్‌ టెస్ట్‌, కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లపై అవగాహన అవసరం. ఒకే అంశం నుంచి ఐదు ప్రశ్నలు వచ్చేలా ఉంటాయి. రోజూ ఆంగ్ల దినపత్రిక చదువుతూ, తెలియని పదాలకు అర్థాలు తెలుసుకుంటూ వాటిని నోట్సుగా రాసుకోవటం మంచిది. మాదిరి ప్రశ్నలను సాధన చేస్తూ లోపాలు సరిదిద్దుకోవాలి.
* తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు.
* విభాగాలవారీగా కటాఫ్‌ మార్కులున్నాయి.
* ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
టైర్‌-2 పరీక్ష:
* సమాజంలోని ముఖ్య సంఘటనలూ, ప్రభుత్వ పథకాల గురించి తక్కువ పదాలతో ఎక్కువ సమాచారం ఇచ్చేలా వ్యాసరచన అలవాటు చేసుకోవాలి.
* ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రెస్సీల్లో భాష ఉపయోగించే క్రమంలో తప్పులు లేకుండా స్పష్టంగా, క్లుప్తంగా రాయటం అభ్యసించాలి.

Notification Online Application
Reference Books
  • » IB ACIO Guide by R. Gupta
  • » Bharti Pariksha (Hindi) by Pratiyogita Sahitya
  • » Bharti Pariksha (Hindi) by Lal & Jain
  • » ACIO Practice work book by Kiran Prakashan