కామర్స్ కోర్సులు దేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు, బహుళజాతి కంపెనీల రాకతో కామర్స్ నిపుణులకు డిమాండ్ ఎక్కువైంది. ముఖ్యంగా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగడంలో కామర్స్ నిపుణుల పాత్ర కీలకమైంది. మార్కెట్ అవసరాలకు తగిన విధంగా కామర్స్ నిపుణులను అందించేందుకు యూనివర్సిటీలు, కొన్ని సంస్థలు కామర్స్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇంటర్ అర్హతతో కామర్స్ కోర్సులు చదవడం ద్వారా చిన్న వయసులోనే ఉపాధిని చేపట్టి మంచి భవిష్యత్తును పొందవచ్చు. |
వాణిజ్య వ్యవహారాల సక్రమ పర్యవేక్షణకు తగిన నిపుణులను తీర్చిదిద్దాలనే ఆలోచనకు 1886 లో మద్రాస్‌లో అంకురార్పణ జరిగింది. అప్పటి పచియప్ప ఛారిటీస్‌కు చెందిన ట్రస్ట్ సభ్యులు మొదటిసారిగా కమర్షియల్ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాత 1895లో ప్రభుత్వం కాలికట్‌లో స్కూల్ ఆఫ్ కామర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.1913లో మంబయిలో సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ఎకనమిక్స్‌ను స్థాపించడంతో యూనివర్సిటీ స్థాయిలో కామర్స్ కోర్సు ప్రారంభమైంది. |
![]() |
ఇంటర్ తర్వాత కామర్స్ కోర్సుల్లో చేరాలనుకునే వారికి మొదటి మెట్టు బీకాం డిగ్రీ. ఈ కోర్సును రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు అందిస్తున్నాయి.
|
