Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home










దూర విద్య

నేరుగా మన ఇంటికి.. కోరుకున్న కోర్సులు

కారణాలు ఏవైనా... ఏటా వేలాదిమంది దూరవిద్యలో అడ్మిషన్లు తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో సాధారణ కోర్సులు సహా సంప్రదాయ సంస్థల్లో లేని ఎన్నో రకాల వైవిధ్య కోర్సులను డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అందిస్తున్నారు. రెగ్యులర్‌ పట్టాలతో సమానంగా ఈ డిగ్రీలకూ ప్రాధాన్యం లభిస్తోంది. దీంతో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి పనులు చేసుకుంటూ ఉన్నత విద్యను సాగిస్తున్నారు. అవకాశాలను మెరుగు పరుచుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌ అర్హతతోనూ వివిధ కోర్సులు దూరవిద్యలో ఉన్నాయి.

కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్ఛు అనారోగ్యం, ఆర్థిక నేపథ్యం, ఆసక్తి లేకపోవడం...కారణాలు ఏమైనా.. చదువులకు ఇంటర్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన పనిలేదు. ఇంటి వద్దే ఉంటూ ఆసక్తి, అభిరుచి ప్రకారం విద్యాభ్యాసాన్ని కొనసాగించుకోవచ్ఛు ఇంటర్మీడియట్‌ అర్హతతో సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సులను పలు విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఉద్యోగాలకు పోటీ పడవచ్ఛు ఉన్నత చదువులు కొనసాగించవచ్ఛు.

రెగ్యులర్‌తో సమానంగా!
డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అనగానే కొద్దిగా చిన్నచూపు చూస్తుంటారు. ఈ డిగ్రీలు వచ్చినా పరిజ్ఞానం అంతగా ఉండదని ఆలోచిస్తుంటారు. కొన్ని నియామక సంస్థలూ ఇదే ధోరణని ప్రదర్శిస్తున్నాయి. కానీ అది వాస్తవం కాదు. ఇగ్నో, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సహా పలు ఇతర సంస్థలు ఇప్పుడు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నాయి. తమ స్టడీ సెంటర్లలో నిర్దేశిత రోజుల్లో ప్రభుత్వ సీనియర్‌ డిగ్రీ లెక్చరర్లతో కాంటాక్టు తరగతులూ నిర్వహిస్తున్నాయి. సందేహ నివృత్తికీ అవకాశం కల్పిస్తున్నాయి. విద్యార్థి ఏ యూనివర్సిటీలో చేరినప్పటికీ స్వయం పోర్టల్‌, స్వయంప్రభ ఛానళ్ల ద్వారా తమ సిలబస్‌ ప్రకారం పాఠాలు వినవచ్ఛు అందువల్ల పాఠాలు అర్థం కాకపోవడమనే పరిస్థితి లేదు. పరిజ్ఞానం ఉండదనే మాటకు చోటు లేదు. సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగాల కోసం స్టడీ సెంటర్లలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో దూరవిద్యలో చదివినవారు రెగ్యులర్‌ విధానంలో చదువుకున్నవారితో సమానంగా పోటీపడుతున్నారు. దూరవిద్యలో డిగ్రీకి విలువ ఉంటుందా అనే సందేహం చాలామందికి తలెత్తుతుంది. కానీ యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ తదితర పరీక్షలు మొదలు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకులు, రైల్వేలు, పోలీసు, రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు ఉద్యోగ పరీక్షలకు ఈ పట్టాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఏడాదికి రెండు సార్లు...
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ తదితర అన్ని విశ్వవిద్యాలయాలూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి దూరవిద్యలో కోర్సులను అందిస్తున్నాయి. ప్రవేశ ప్రకటనలు జులై/ ఆగస్టుల్లో వెలువడతాయి. రెగ్యులర్‌ విధానంలో కళాశాలల్లో ప్రవేశాలు ఏడాదికి ఒకసారే ఉంటాయి. దూరవిద్యలో మాత్రం అడ్మిషన్లు రెండుసార్లు లభిస్తాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పలు సంస్థలు జనవరి, జులై సెషన్లలో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. జులై సెషన్‌లో చేరినవారు రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా అకడమిక్‌ సంవత్సరం వృథా కాకుండా డిగ్రీ పూర్తిచేసుకోవచ్ఛు ఏ కారణంతోనైనా జులైలో వీలుపడనివారు, సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులు మరో ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా జనవరి సెషన్‌లో చేరవచ్ఛు.

సర్టిఫికెట్‌ కోర్సులు: డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఎన్జీవో మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ స్కిల్స్‌, ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌, హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం స్టడీస్‌, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, పౌల్ట్రీ ఫార్మింగ్‌, హ్యూమన్‌ రైట్స్‌, కన్సూమర్‌ ప్రొటెక్షన్‌, ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా, కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ స్కిల్స్‌, వాల్యూ ఎడ్యుకేషన్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లైఫ్‌ అండ్‌ థాట్‌ ఆఫ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ట్రైబల్‌ స్టడీస్‌, జపనీస్‌ లాంగ్వేజ్‌, కొరియన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెన్స్‌, జెరియాట్రిక్‌ కేర్‌ అసిస్టెన్స్‌, ఫ్లెబోటమీ అసిస్టెన్స్‌, హోం హెల్త్‌ అసిస్టెన్స్‌, పర్షియన్‌ లాంగ్వేజ్‌, యోగా, పీస్‌ స్టడీస్‌ అండ్‌ కన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం ఆన్‌ జీఎస్టీ.

డిప్లొమాలు: ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, పంచాయత్‌ లెవెల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, టూరిజం స్టడీస్‌, ఆక్వా కల్చర్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌, ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, పారా లీగల్‌ ప్రాక్టీస్‌, వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌, ప్రొడక్షన్‌ ఆఫ్‌ వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం సెరియల్స్‌, పల్సెస్‌, ఆయిల్‌ సీడ్స్‌; ఫిష్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, వాటర్‌ షెడ్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌, మోడరన్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌, మీట్‌ టెక్నాలజీ. డిప్లొమా ఇన్‌ డెయిరీ టెక్నాలజీ కోర్సును తెలుగు మాధ్యమంలో ఇగ్నో అందిస్తోంది.

డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌): యాక్సెంచర్‌ సంస్థతో కలిసి ఇగ్నో ఈ కోర్సు అందిస్తోంది. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ అంశాలు, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌, ఐటీ స్కిల్స్‌లో మెలకువలు నేర్పుతారు. 50 శాతం మార్కులతో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్ఛు కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు రూ.19,200.

బీబీఏ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌: దీన్ని మహారాష్ట్ర నాలెడ్జ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి అందిస్తోంది. వ్యవధి మూడేళ్లు. ఫీజు ఏడాదికి రూ.20,000. సేవా రంగంలో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పుతారు.

డిగ్రీ: బీఏ టూరిజం స్టడీస్‌, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, అందుబాటులో ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌) కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో నిర్వహిస్తోంది. సీబీసీఎస్‌ ఆనర్స్‌ విధానంలో బీఏ- ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఇంగ్లిష్‌, హిందీ; బీఎస్సీ- ఆంత్రోపాలజీ కోర్సులను చదువుకోవచ్ఛు.

డిప్లొమా ఇన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌: కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక విభాగాలు తమ బ్రాండ్‌ ప్రమోషన్‌, ప్రొడక్ట్‌ లాంచింగ్‌, ఆడియో ఫంక్షన్‌ వంటి కార్యక్రమాలకూ, ఇళ్లలో వేడుకలకూ ఈవెంట్‌ నిర్వాహకులపైనే ఆధారపడుతున్నారు. ఇగ్నో అందించే ఈ కోర్సు పూర్తిచేస్తే ఈవెంట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరవచ్ఛు సొంతంగా ఈవెంట్స్‌ నిర్వహించుకోవచ్ఛు http://www.ignou.ac.in/

ఒకటే సిట్టింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే పరీక్షలకు అనుమతించడం లేదు బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్యలో చదువుకునే అవకాశం లేదు.

తక్కువ ఫీజులతో ఇగ్నో కోర్సులు
దూరవిద్య అనగానే వెంటనే గుర్తుకువచ్చేది ఇగ్నో. కోర్సుల్లో నాణ్యత, అందుబాటులో స్టడీ సెంటర్లు, తక్కువ ఫీజు మొదలైన కారణాలతో ఎక్కువమంది ఇగ్నోలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటర్‌ విద్యార్హతతో ఆరు నెలల సర్టిఫికెట్‌, ఏడాది డిప్లొమా, మూడేళ్ల డిగ్రీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో...
బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దూరవిద్య కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు. ఇక్కడ ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారి కోసం వివిధ సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను నిర్వహిస్తున్నారు.
ఆర్ట్స్‌ కోర్సులు: తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం; సోషల్‌ సైన్సెస్‌ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.
విజ్ఞానశాస్తాల్రు (సైన్స్‌): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం; వాణిజ్యశాస్త్రం. కామర్స్‌. కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఏటా జనవరి, జులై నెలల్లో ప్రకటనలు వస్తాయి. https://braou.ac.in/

ఆంధ్రా యూనివర్సిటీ
ఇంటర్‌ విద్యార్హతతో బీఏ, బీకామ్‌, బీఎస్సీలను పలు కాంబినేషన్లతో ఇవ్వడంతోపాటు వివిధ సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు. ప్రకటన జులైలో వస్తుంది.
సర్టిఫికెట్‌ కోర్సులు: ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ అకౌంటింగ్‌, ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ మల్టీమీడియా టెక్నాలజీస్‌, ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీస్‌లను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. వ్యవధి ఏడాది.
డిప్లొమా కోర్సులు: మ్యూజిక్‌. వ్యవధి రెండేళ్లు. స్పోకన్‌ హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ 6 నెలలు.
https://www.andhrauniversity.edu.in/

ఉస్మానియా యూనివర్సిటీ
బీఏలో వైవిధ్యమైన సబ్జెక్టు కాంబినేషన్లు కోరుకునేవారు ఓయూలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్ఛు. ప్రకటన: జులైలో. https://www.oucde.net/

ఆచార్య నాగార్జున వర్సిటీ
ఎకనామిక్స్‌, బ్యాంకింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కాంబినేషన్‌తో బీఏ కోర్సులను అందిస్తోంది. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పలు సబ్జెక్టులతో అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన: జులైలో. http://www.anucde.info/

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
బీఏ కర్ణాటక మ్యూజిక్‌, బీఏ స్పెషల్‌ తెలుగు వంటి వివిధ కోర్సులను అందిస్తోంది.
ప్రకటన: సెప్టెంబరులో. http://teluguuniversity.ac.in/
ఇంకా ఎస్‌వీయూ, ఎస్‌కేయూ తదితరాలతోపాటు ప్రైవేటు సంస్థలూ దూరవిద్యలో ఎన్నో కోర్సులను ఇంటర్‌ అర్హతతో నిర్వహిస్తున్నాయి.

Posted on 13-05-2020


అందుబాటులో ఉన్నత విద్యావకాశాలు

చదువుకోవాలనే ఆసక్తి ఉండీ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఏంచేయాలో పాలుపోదు. దీంతో చాలా మంది తమకు అందుబాటులో ఉన్న ఇంటర్, డిగ్రీ వంటి కోర్సుల వరకే చదివి సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు కష్టపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువు పూర్తిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను గమనించిన వర్సిటీలు విద్యార్థుల ఇంటివద్దకే విద్యావకాశాలను తీసుకువచ్చేందుకు దూర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ విధానంలో తమ విద్యార్హతలను పెంచుకోవడానికి, ఉద్యోగాల్లో ఉన్నత ప్రమోషన్లకు అవసరమైన కోర్సులు చదవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దూర విద్యా విధానంలో లభిస్తున్న పలు రకాల కోర్సులు, వాటిని అందిస్తున్న వర్సిటీల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం.
దూర విద్యా విధానం మనదేశంలో 1962లో ప్రారంభమైంది. తొలిసారిగా ఢిల్లీ వర్సిటీ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ని ప్రారంభించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దూర విద్యా కోర్సులను నిర్వహిస్తున్న ఏకైక వర్సిటీగా ఇగ్నో గుర్తింపు పొందింది. ఈ వర్సిటీ దేశవ్యాప్తంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగాలు చేసుకునే వారికి బాగా చేరువైంది. దూర విద్యా విధానం వల్ల అభ్యర్థులకు అధిక ప్రయోజనాలు చేకూరుతున్న వాస్తవాన్ని గ్రహించిన ఇగ్నో గ్రామీణ ప్రాంతాల వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని భావించింది. దీనికి అనుగుణంగా గ్రామాల్లో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ఇది కూడా మంచి ఫలితాలను ఇచ్చింది. అలాగే రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ఓపెన్ వర్సిటీలు, రెగ్యులర్ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా తదితర ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి.
డీఈసీ గుర్తింపు తప్పనిసరి
దేశంలో దూర విద్యా విధానంలో లభించే కోర్సులకు న్యూఢిల్లీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ) గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. అలాగే కోర్సులు నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి ఉండాలి. దీనికి సంబంధించి యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు వర్సిటీల జాబితాను పరిశీలించడం అవసరం. ఒకవేళ యూజీసీ గుర్తింపు ఉండికూడా డీఈసీ అనుమతి లేకపోతే ఆ సంస్థలు అందించే దూర విద్యా కోర్సుల సర్టిఫికెట్లకు గుర్తింపు ఉండదు. దీనివల్ల పడిన శ్రమ అంతా కూడా వృథా అవుతుంది. ఈ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల్లోగానీ, ఉన్నత విద్య కోసం పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు యూనివర్సిటీ వివరాలను, అది అందించే కోర్సులను ప్రవేశానికి ముందే పరిశీలించడం అవసరం.
ఇగ్నో
దూర విద్యా విధానంలో ఇగ్నో దేశవ్యాప్తంగా విలువైన కోర్సులను అందిస్తోంది. వీటిలో ఇంటర్ విద్యార్థులకు ప్రధానంగా డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని ప్రధాన డిగ్రీ ప్రోగ్రాములు:
* బీఏ (జనరల్)
* బీఏ ఇన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్
* బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్)
* బీఎస్సీ (ఆనర్స్) (ఆప్టొమెట్రీ అండ్ ఆప్తాల్మిక్ టెక్నిక్స్.
* బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
* బీఎస్సీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, అనెస్తీషియా అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ).
* బీకాం
* బీకాం (మేజర్ సబ్జెక్టులు - అకౌంటెన్సీ, ఫైనాన్స్).
* బీకాం (మేజర్ సబ్జెక్టులు - కార్పొరేట్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్).
* బీకాం (మేజర్ సబ్జెక్టులు - ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్).
* బీబీఏ ఇన్ రిటెయిలింగ్ (డిప్లొమా ఇన్ రిటెయిలింగ్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రిటెయిలింగ్, బీబీఏ ఇన్ రిటెయిలింగ్).
* బీఎల్ఐఎస్‌సీ
* బీసీఏ
* బ్యాచ్‌లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్.
* బ్యాచ్‌లర్ ఆఫ్ టూరిజం స్టడీస్.
* బ్యాచ్‌లర్ ఆఫ్ సోషల్ వర్క్.
* బీఏ ఇన్ 3డీ యానిమేషన్ అండ్ విజువల్ అఫెక్ట్స్.
* బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ మర్చెండైజింగ్ (పెరల్ అకాడమీ సహకారంతో).
* బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్స్‌టైల్ డిజైన్ (పెరల్ అకాడమీ సహకారంతో).
* బ్యాచ్‌లర్ ఆఫ్ అపెరల్ డిజైన్ అండ్ మర్చెండైజింగ్.
* బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్.

డిప్లొమా కోర్సులు:
క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఉర్దూ, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, మీట్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, టూరిజం స్టడీస్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, ఫైర్‌సేఫ్టీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆక్వాకల్చర్, పారాలీగల్ ప్రాక్టీస్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
ఈ వర్సిటీ అధ్యయన కేంద్రాలు మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి.
ప్రవేశం: సంవత్సరంలో జులై, జనవరిల్లో అడ్మిషన్లకు ప్రకటనలు వెలువడుతుంటాయి. జులై సెషన్‌కు దరఖాస్తులను ఏప్రిల్ చివరిలోగా, జనవరి సెషన్‌కు అక్టోబరు లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in

తెలుగు రాష్ట్రాల్లో ... అంబేద్కర్ ఓపెన్‌ వర్సిటీ
తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ తదితర కోర్సులను నిర్వహిస్తూ అత్యధిక ప్రజాదరణ పొందిన యూనివర్సిటీ - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దీన్ని మొదట 'ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ' పేరుతో 'ఎడ్యుకేషన్ ఎట్‌యువర్ డోర్‌స్టెప్' నినాదంతో 1982లో ప్రారంభించారు. కాలక్రమంలో అనేక కొత్త కోర్సులను జతచేస్తూ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు కూడా ఈ వర్సిటీ చేరువవుతోంది. అలాగే దూర విద్యకు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన ఇతర యూనివర్సిటీలైన కాకతీయ, ఉస్మానియా, నాగార్జున శ్రీ వేంకటేశ్వర,పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మొదలైనవి కూడా దూర విద్యా విధానంలో కోర్సులను అందిస్తున్నాయి.
అంబేద్కర్ ఓపెన్‌ వర్సిటీ
కోర్సులు: ఇంటర్ అర్హతతో ప్రధానంగా డిగ్రీ కోర్సులను అందిస్తోంది.
అవి... 1) బీఏ, 2) బీకాం 3) బీఎస్సీ
వీటితోపాటు డిగ్రీ అర్హతతో పీజీ ప్రోగ్రాములు, పీజీ డిప్లొమాలు, టీచర్‌గా సర్వీస్‌లో ఉన్న వారికి బీఈడీ, మొదలైన కోర్సులను అందిస్తోంది. ఈ వర్సిటీకి రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో అధ్యయన కేంద్రాలున్నాయి.
ప్రవేశం: విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటనలు వెలువడుతుంటాయి.
చిరునామా: Dr. B.R. Ambedkar Open University,
Prof. G. Ram Reddy Marg, Road No.46,
Jubilee Hills,
Hyderabad - 500033
వెబ్‌సైట్: www.braou.ac.in.

ఉస్మానియా వర్సిటీ
హైదరాబాద్‌లో 1918లో ఏర్పడిన ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన వర్సిటీగా పేరొందింది. ఈ వర్సిటీ దూర విద్యా విధానంలో డిగ్రీ, పీజీ తదితర కోర్సులను నిర్వహిస్తోంది. ఇంటర్ అర్హతతో చేరదగిన కొన్ని ప్రధాన డిగ్రీ కోర్సులు..
* బీఏ
* బీఏ (లాంగ్వేజెస్)
* బీకాం.
* బీఏ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
* బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
* మాడ్యులర్ సర్టిఫికెట్ కోర్సులు.
వీటితోపాటు డిగ్రీ ఆపైన అర్హతలున్న వారికి పీజీ, డిప్లొమా తదితర కోర్సులున్నాయి. ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెలువడతాయి.
వెబ్‌సైట్: www.oucde.ac.in

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
హైదరాబాద్‌లో ఉన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 1998 నుంచి దూర విద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులను అందిస్తోంది. ఇంటర్ అర్హత ఆధారంగా చేరదగిన కోర్సుల వివరాలు...
* బీఏ
* బీకాం
* బీఎస్సీ
* డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్
* డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ఆరంభంలో వస్తుంటాయి.
వెబ్‌సైట్: www.manuu.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ
దూర విద్యా విధానంలో డిగ్రీ తదితర కోర్సుల నిర్వహణలో వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంటర్ అర్హతతో పలు విభాగాల్లోఈ వర్సిటీ అందిస్తున్న కోర్సులు...
* బీఏ, బీకాం తదితరాలు.
* కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు: ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీస్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్.
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ఆరంభంలో వస్తుంటాయి.
వెబ్‌సైట్: http://www.andhrauniversity.edu.in/

తెలుగు రాష్ట్రాల్లో దూర విద్యా విధానంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర ప్రోగ్రాములను ఇతర యూనివర్సిటీలు కూడా అందిస్తున్నాయి. అవి...
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
* కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
వెబ్‌సైట్: www.sdlceku.co.in
* శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
వెబ్‌సైట్: www.skuniversity.org
* శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
వెబ్‌సైట్: http://www.spmvv.ac.in/index.html
* జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (www.jntuh.ac.in ) మొదలైనవి.
సాంకేతికంగా ముందడుగు
దూర విద్య ద్వారా చదవడం అంటే యూనివర్సిటీలు పోస్టు ద్వారా స్టడీ మెటీరియల్ పంపడం, పరీక్షల సమయంలో ప్రాక్టికల్స్, క్లాసులు నిర్వహించడం...ఇదంతా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ. రేడియో, టీవీ, కంప్యూటర్ తదితర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చినతర్వాత విద్యార్థులకు తగిన సలహాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయడం మొదలైంది. ఇప్పుడు శాటిలైట్ ద్వారా శిక్షణ ఇవ్వడం ఈ విధానంలో మరికొంత ముందడుగు. ఆధునిక సౌకర్యాలను యూనివర్సిటీలు స్టడీ సెంటర్లలో కల్పిస్తూ విద్యార్థులకు నిరంతరం తమ సేవలు అందుబాటులో ఉండేందుకు వర్సిటీలు కృషి చేస్తున్నాయి.
ఇతర రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల‌కు ఇరుగు పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిషా మొదలైన రాష్ట్రాలు కూడా దూర విద్యా విధానంలో సర్టిఫికెట్ కోర్సుల నుంచి పీజీ స్థాయి వరకూ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటిలో ప్రముఖ యూనివర్సిటీల వివరాలు:
అన్నామలై: www.annamalaiuniversity.ac.in
తమిళనాడు ఓపెన్ వర్సిటీ: www.tnou.ac.in
భారతీదాసన్ వర్సిటీ: www.bdu.ac.in
మద్రాస్ వర్సిటీ: www.unom.ac.in
కర్ణాటక ఓపెన్ వర్సిటీ: www.karnatakastateopenuniversity.co.in
మదర్ థెరిసా మహిళా యూనివర్సిటీ
కొడైకెనాల్‌లోని మదర్ థెరిసా ఉమెన్స్ యూనివర్సిటీ (డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) దూర విద్యా విధానంలో విలువైన కోర్సులను అందిస్తోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
1) డిగ్రీ కోర్సులు: బీఏ (మ్యూజిక్), బీఏ (ఉమెన్ స్టడీస్), బీఎస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మొదలైనవి. కనీస అర్హత ఇంటర్ ఉండాలి.
2) డిప్లొమాలు: సాఫ్ట్ స్కిల్స్, ఫ్యామిలీ లైఫ్ కౌన్సెలింగ్, కెరీర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సెలింగ్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్. అర్హత: కనీసం ఇంటర్.
3) సర్టిఫికెట్ కోర్సులు: లోకల్ గవర్నెన్స్, ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మేనేజ్‌మెంట్, స్పోకన్ ఇంగ్లిష్ మొదలైనవి. అర్హత: ఇంటర్
4) పీజీ కోర్సులు: ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ (ఉమెన్ స్టడీస్), ఎంఎస్సీ (గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్) మొదలైనవి. అర్హత: డిగ్రీ ఉండాలి.
5) పీజీ డిప్లొమాలు: ఆర్కియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, క్లినికల్ సైకాలజీ. అర్హత: డిగ్రీ.
పూర్తి వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.motherteresawomenuniv.ac.in